చెన్నై : విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన ‘ట్రెయిన్’ చిత్రానికి సంబంధించి పవర్ఫుల్ ట్రైలర్ విడుదలైంది. మిస్కిన్ రచన , దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను నిర్మాత కలైపులి ఎస్. థాను ఆవిష్కరించారు. వేగంగా కదులుతున్న రైలులో బందీలుగా ఉన్నవారిని రక్షించేందుకు విజయ్ సేతుపతి చేపట్టే మిషన్ , ఆయన పాత్రకు సంబంధించిన కొన్ని దృశ్యాలను ఈ ట్రైలర్ చూపిస్తుంది. ఈ చిత్రానికి దర్శకుడు మిస్కిన్ స్వయంగా సంగీతాన్ని కూడా అందించారు. ఈ సినిమాలో నాజర్, శృతి హాసన్, యుగి సేతు, నరైన్, కె.ఎస్. రవికుమార్, సంపత్ రాజ్, కలైయరసన్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. వీరితో పాటు ఇరా దయానంద్, విన్సెంట్ అశోకన్, అజయ్ రత్నం, బబ్లూ పృథ్వీరాజ్, త్రిగుణ్ అరుణ్, గణేష్ వెంకట్రామన్, ప్రీతి కరణ్, సింగంపులి, సురేష్ చంద్ర మీనన్, షాజీ, సెల్వా చంద్రశేఖర్, జి.ఆర్. ఆదిత్య, రోహన్, కనిహ, జనని, దియా శర్మ మరియు కోమగన్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
చిత్ర బృందం ఇంకా ప్రధాన పాత్రల గురించి లేదా ప్రతినాయకుల గురించి స్పష్టత ఇవ్వనప్పటికీ, రైలు హైజాక్ వెనుక నాజర్ పాత్రే సూత్రధారిగా ఉన్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. ఇది ఒక ఉత్కంఠ భరితమైన యాక్షన్ థ్రిల్లర్‌గా కనిపిస్తుండగా దీనిని “ఈ ఏడాది అత్యుత్తమ యాక్షన్ థ్రిల్లర్” అని చిత్ర బృందం పేర్కొంది. ఈ ట్రైలర్ సినీ పరిశ్రమలోని పలువురి దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దీనిని సోషల్ మీడియాలో పంచుకుంటూ “కిక్-యాస్” (అద్భుతంగా ఉంది) అని పేర్కొనడమే కాకుండా, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ చిత్రానికి ఫౌజియా ఫాతిమా ఛాయాగ్రహణం అందించగా శ్రీ వాట్సన్ , షబాన్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. కళా దర్శకత్వాన్ని మోహన మహేంద్రన్ నిర్వహించారు. ఈ చిత్రాన్ని కలైపులి ఎస్. థాను తన ‘వి క్రియేషన్స్’ బ్యానర్‌పై నిర్మించారు.
దర్శకుడు మిస్కిన్, నటుడు విజయ్ సేతుపతి కలిసి పనిచేస్తున్న మొదటి చిత్రం ఇదే అయితే గతంలో ‘సూపర్ డీలక్స్’ చిత్రంలో వీరిద్దరూ కలిసి పనిచేశారు . అందులో మిస్కిన్ నటుడిగా నటించడంతో పాటు రచయితగా కూడా సహకరించారు.అనేక వాయిదాల అనంతరం ‘ట్రెయిన్’ చిత్రం చివరకు డిసెంబర్ 4 (శుక్రవారం)న థియేటర్లలో విడుదల కానుంది.
















