TPCC Chief : హైదరాబాద్ – జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై పీసీసీ (TPCC Chief) సీరియస్ అయ్యింది. తమ పార్టీలో, ప్రభుత్వంలో కోవర్టులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని ఆదేశించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సోమవారం జరిగే సమావేశంలో తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై ఇంకా స్పందించ లేదు అనిరుధ్ రెడ్డి. ఇదిలా ఉండగా తను చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. పార్టీలో తీవ్ర చర్చకు దారి తీశాయి.
TPCC Chief Strong Warning to MLA Anirudh Reddy
శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ వేదికగా పీసీసీ కీలక కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో పాటు పార్టీ దేశ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశం జరుగుతుండగానే జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆయన గెలిచినప్పటి నుంచి వైరల్ గా మారుతూ వచ్చారు. హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో కొందరి ఎమ్మెల్యేలతో కలిసి మీటింగ్ నిర్వహించడం, మంత్రులపై సెటైర్స్ వేశారు. సంచలన ఆరోపణలు చేశారు.
కమిషన్లు ఇస్తే కానీ పనులు కావడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో తాజాగా ఆయన ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి గురువుగా భావించే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ఎక్కు పెట్టారు. తనకు సంబంధించిన వాళ్లే అన్ని పనుల్లో కాంట్రాక్టులు పొందారంటూ ఫైర్ అయ్యారు. బకనచర్ల ఆగాలంటే ఆంధ్రోళ్ల ఇళ్లకు నల్లా నీళ్లు, కరెంట్ బంద్ చేయాలని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయినా జనుంపల్లి అనిరుధ్ రెడ్డి పట్టించు కోవడం లేదు.
Also Read : TVK Vijay Record Breaking : టీవీకే సీఎం అభ్యర్థిగా దళపతి విజయ్
