TPCC Chief Mahesh Kumar Fired on BRS : తెలంగాణ‌లో బీఆర్ఎస్ శ‌కం ముగిసింది

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీదే విజ‌యం

Hello Telugu - TPCC Chief Mahesh Kumar Fired on BRS

Hello Telugu - TPCC Chief Mahesh Kumar Fired on BRS

TPCC Chief Mahesh Kumar : హైద‌రాబాద్ : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప‌నై పోయింద‌న్నారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. గురువారం జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని రహ్మత్ నగర్ లో బూత్ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి,ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, మాజీ ఎంపీ అజారుద్దీన్, స్థానిక సీనియర్ నాయకులు . ఈ సంద‌ర్బంగా టీపీసీసీ చీఫ్ (TPCC Chief Mahesh Kumar) ప్ర‌సంగించారు. బీఆర్ఎస్ ను ఏకి పారేశారు.
జూబ్లీ హిల్స్ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడటం ఖాయం అన్నారు. ప్రజాభిప్రాయం మేరకే ఉప ఎన్నిక అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ఎంపిక చేశామ‌న్నారు. బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంస పాలనను ప్రజలు ఇంకా మ‌రిచి పోలేద‌న్నారు. యువత చెడు వ్యసనాలకు బారిన పడిన విషయం ఇంకా మ‌రిచి పోతార‌ని అనుకుంటే ఎలా అని కేటీఆర్ ను ఉద్దేశించి ప్ర‌శ్నించారు.

TPCC Chief Mahesh Kumar Slams BRS Party

బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పుడైన ఊహించారా? 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం ఇస్తారని అనుకున్నారా అని అన్నారు మ‌హేష్ కుమార్ గౌడ్. ప్రజల కష్ట కాలంలో తోడుగా ఉండే నాయకుడు కావాలని నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించామ‌న్నారు. ప్రజలకు కావల్సింది సెంటిమెంట్ కాదు కావల్సింది అభివృద్ది అని అన్నారు టీపీసీసీ చీఫ్‌. కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నార‌ని, న‌గ‌రంలో, రాష్ట్రంలో డ్ర‌గ్ క‌ల్చ‌ర్ ను తీసుకు వ‌చ్చింది నువ్వు కాదా అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కాంగ్రెస్ మాటకు కట్టుబడి ఉండే పార్టీ అని అన్నారు. జూబ్లీ హిల్స్ అన్ని రకాలుగా అభివ్రుది చెందాలంటే నవీన్ యాదవ్ గెలవాల్సిన అవస‌రం ఉంద‌న్నారు.

Also Read : PM Modi Srisailam Visit Important Updates : శ్రీ‌శైలంలో పూజ‌లు చేసిన ప్ర‌ధాని మోదీ

Exit mobile version