Tom Moody Growth : ల‌క్నో జెయంట్స్ గ్లోబ‌ల్ డైరెక్ట‌ర్ గా టామ్ మూడి

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన జ‌ట్టు యాజ‌మాన్యం

Hello Telugu - Tom Moody Growth

Hello Telugu - Tom Moody Growth

Tom Moody : ల‌క్నో : వ‌చ్చే ఏడాది 2026లో జ‌రిగే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ కోసం ఇప్ప‌టి నుంచే ఆయా జ‌ట్ల యాజ‌మాన్యాలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఈ మేర‌కు మినీ వేలం పాట జ‌ర‌గ‌నుంది. ఆయా జ‌ట్లు కొంద‌రు ఆట‌గాళ్ల‌ను రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ప్ర‌ధానంగా సంజూ శాంస‌న్ పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఇదిలా ఉండ‌గా తాజాగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మేనేజ్మెంట్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు గ్లోబ‌ల్ డైరెక్ట‌ర్ గా ప్ర‌ముఖ మాజీ క్రికెట‌ర్ టామ్ మూడీని (Tom Moody) నియ‌మించిన‌ట్లు తెలిపింది. అధికారికంగా స్ప‌ష్టం చేసింది. గ‌తంలో మూడీ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు సేవ‌లు అందించాడు. త‌ను ఆస్ట్రేలియా త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించాడు. ఆ జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాల‌ను చేకూర్చి పెట్టాడు.

Tom Moody Gets a Chance

టామ్ మూడీకి ప్ర‌స్తుతం 60 ఏళ్లు. 2022లో బ్రియాన్ లారా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఫ్రాంచైజీని విడిచిపెట్టాడు. ఇదిలా ఉండ‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ లో అనుభ‌వం, విజ‌న్, నాయ‌క‌త్వం క‌లిగిన మూడిని తమ‌తో చేరాల‌ని ఆహ్వానిస్తున్నామ‌ని పేర్కొంది. ఆస్ట్రేలియా ఆటగాడిగా తన కాలంలో మూడీ ఎనిమిది టెస్టులు, 76 వన్డేలు ఆడాడు. 1667 పరుగులు చేశాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 54 వికెట్లు పడగొట్టాడు. అతను షెఫీల్డ్ షీల్డ్ క్రికెట్‌లో ఒక దిగ్గజం, 64 సెంచరీలతో సహా 21,000 ఫస్ట్-క్లాస్ పరుగులు చేశాడు. అంతే కాకుండా 361 వికెట్లు తీసుకున్నాడు.

Also Read : Minister Anitha Interesting Update : పోలీస్ శాఖ‌లో 6,100 పోస్టులు భ‌ర్తీ చేస్తాం

Exit mobile version