Gold : బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇటీవలే రూ.1 లక్ష మార్కు దాటిన బంగారం ధరలు, తాజాగా మరింత పెరగడం పసిడి ప్రియులను ఆశ్చర్యానికి గురిచేసింది. జూలై 22, 2025 ఉదయం 6:20 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.130 పెరిగి రూ.1,00,160గా నమోదైంది. అదే సమయంలో, 22 క్యారెట్ల బంగారం (Gold) ధర రూ.91,810కి చేరుకుంది.
Gold – ధరల పెరుగుదల వెనుక కారణాలు
బంగారం ధరల పెరుగుదలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం, డాలర్ మారకవినిమయ విలువలో మార్పులు, ద్రవ్యోల్బణ పరిస్థితులు వంటి అంశాలు కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు):
హైదరాబాద్, విజయవాడ, ముంబై, చెన్నై, బెంగళూరు, కేరళ, పూణే:
- 24 క్యారెట్లు – ₹1,00,160
- 22 క్యారెట్లు – ₹91,810
ఢిల్లీ:
- 24 క్యారెట్లు – ₹1,00,310
- 22 క్యారెట్లు – ₹91,960
కోల్‌కతా:
- 24 క్యారెట్లు – ₹99,510
- 22 క్యారెట్లు – ₹91,230
అహ్మదాబాద్:
- 24 క్యారెట్లు – ₹1,00,210
- 22 క్యారెట్లు – ₹91,860
ఈ ధరలు స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, దిగుమతి సుంకాలు ఆధారంగా మారవచ్చని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
ఇక వెండి ధరలు గతంతో పోలిస్తే ఎలాంటి మార్పు లేకుండా ఉన్నాయి. ముంబైలో కిలో వెండి ధర రూ.1,15,900గా ఉండగా, ఇతర నగరాల్లో ఈ ధరలు ఇలా ఉన్నాయి:
- హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళ: ₹1,25,900
- ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్: ₹1,15,900
బంగారం ధరలు ఎటు వైపు తిరుగుతాయో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నవారు మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : Gold silver Price Today : పసిడి ధరలపై కొంత ఊరట
