Gold : బంగారం కొనుగోలు చేయాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇదొక శుభవార్త. ఇటీవల వరుసగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గి, వినియోగదారులకు ఊరటనిచ్చాయి.
Today Gold Price Updates
నేటి ధరల వివరాల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,760గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,440గా ఉంది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే ఒక్కొక్క క్యారెట్లకు రూ.10 తగ్గుదలగా నమోదు అయింది. జూలై 15న 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,770 కాగా, 22 క్యారెట్ల ధర రూ.91,450గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి:
హైదరాబాద్:
24 క్యారెట్లు – రూ.99,760
22 క్యారెట్లు – రూ.91,440
వెండి ధర (కిలో) – రూ.124,900 (రూ.100 తగ్గుదల)
విజయవాడ, విశాఖపట్నం:
24 క్యారెట్లు – రూ.99,890
22 క్యారెట్లు – రూ.91,560
వెండి ధర – రూ.124,900
వరంగల్:
24 క్యారెట్లు – రూ.99,890
22 క్యారెట్లు – రూ.91,560
వెండి ధర – రూ.124,900
ఇటీవల అంతర్జాతీయ మార్కెట్‌లో లభ్యమైన మార్పుల ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్లు నిపుణులు భావిస్తున్నారు. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అయితే, ధరల్లో ఎప్పుడైనా మార్పులు చోటు చేసుకోవచ్చునన్న నేపథ్యంలో తాజా సమాచారం తెలుసుకుంటూ కొనుగోలు చేయడం ఉత్తమం.
Also Read : Today Gold Price : రోజురోజుకు పెరుగుతూ పోతున్న పసిడి ధరలు
