Today Gold Price : భారీగా దూసుకుపోతున్న పసిడి ధరలు

ఇది సామాన్య వినియోగదారులకు భారీ భారం అవుతోంది...

Hello Telugu - Today Gold Price

Hello Telugu - Today Gold Price

Gold : అమెరికా విధించిన వాణిజ్య సుంకాలు మరియు అంతర్జాతీయ ఆర్ధిక అస్థిరతల ప్రభావం భారతీయ బంగారం, వెండి మార్కెట్లపై తీవ్రంగా పడుతున్నాయి. తాజా ధరల ప్రకారం, బంగారం (Gold) తులానికి ధర లక్ష రూపాయల మార్క్‌ను దాటగా, వెండి కూడా కిలోకు లక్ష రూపాయలకుపైగా దూసుకుపోయింది. ఇది సామాన్య వినియోగదారులకు భారీ భారం అవుతోంది.

Gold – ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు):

వెండి ధర:

ప్రస్తుతం కిలో వెండి ధర ₹1,12,900 వద్ద ఉండడం గమనార్హం. ఇదే ధర ఇప్పటికే చాలా నెలలుగా కొనసాగుతోంది.

బంగారం (Gold) ధరల్లో ఈ స్థాయిలో పెరుగుదల రావడానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా, అమెరికా డాలర్ బలపడటం, గ్లోబల్ మార్కెట్లలో పెట్టుబడిదారుల ఆందోళనలు, ట్రంప్ ఆధ్వర్యంలోని వాణిజ్య విధానాల వల్ల బంగారం మరియు వెండి వంటి లోహాలను సురక్షిత పెట్టుబడిగా భావించటం ఇందుకు దోహదపడుతోంది.

ఇతిహాస ధృష్టితో చూస్తే:

గత రెండు దశాబ్దాల్లో బంగారం మరియు వెండి ధరల్లో భారీ పెరుగుదల నమోదైంది. 2005లో 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹7,600 మాత్రమే ఉండగా, 2025 నాటికి అదే బంగారం రూ.1 లక్ష దాటిన వాస్తవం దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి లాభాలను సూచిస్తోంది. వెండి ధరలు కూడా ఇదే మార్గంలో ముందుకెళ్తున్నాయి.

ప్రస్తుతం బంగారం ధరల పెరుగుదల తాత్కాలికంగా తగ్గే సూచనలు లేకపోవడం, సామాన్య వినియోగదారులు, కూనుగోలు చేసే వారికి ఆందోళన కలిగిస్తోంది. ఇక పెళ్లిళ్లు, ఉత్సవాల సమయంలో పసిడి కొనుగోళ్లపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. పెట్టుబడిదారుల దృష్టిలో మాత్రం ఇది లాభదాయక అవకాశంగా కనిపిస్తోంది.

Also Read : Today Gold Price : నిన్నటికి, ఈ రోజుకి 1500 పైగా పెరిగిన పసిడి ధరలు

Exit mobile version