Today Gold and Silver Price : మల్లి దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు

ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర ₹91,700కి చేరింది...

Hello Telugu - Today Gold and Silver Price

Hello Telugu - Today Gold and Silver Price

Gold : దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగిన పసిడి ధర తాజాగా ఒక్కసారిగా పెరిగి లక్ష రూపాయల మార్క్‌ను అధిగమించింది. శనివారం ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (Gold) ధర 10 గ్రాములకు ₹1,00,040గా నమోదైంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర ₹91,700కి చేరింది.

Today Gold and Silver Price

ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలాగే నమోదయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీలో బంగారం (Gold) ధర మరింతగా పెరిగి 24 క్యారెట్లకు ₹1,00,190, 22 క్యారెట్లకు ₹91,850గా ఉంది. మిగిలిన నగరాల్లో మాత్రం హైదరాబాద్, చెన్నై, పూణే, బెంగళూరు వంటి చోట్ల ధరలు సమానంగా ఉన్నాయి.

బంగారం ధర పెరుగుదలతో పాటు వెండి ధరల్లోనూ భారీగా పెరుగుదల చోటు చేసుకుంది. హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, కేరళ వంటి నగరాల్లో వెండి ధర కిలోకు ₹1,26,000గా ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో ₹1,16,000గా ఉంది.

ఈ పరిణామాలు బంగారం కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే కుటుంబాలు నేడు పెరిగిన ధరలతో ఖర్చు ఎక్కువవుతుందనే ఉద్దిగ్నతకు లోనవుతున్నాయి. మరోవైపు, బంగారాన్ని పెట్టుబడిగా చూసే వారు మాత్రం పెరుగుతున్న రేట్లను లాభదాయక అవకాశంగా భావిస్తున్నారు.

ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, రూపాయి మారక విలువపై ఒత్తిడి, ముడి చమురు ధరల ప్రభావం వంటి అంశాలే బంగారం ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయని అంటున్నారు. రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

అటు, బంగారం కొనుగోలు చేసే వినియోగదారులకు నిపుణుల సూచన – కొనుగోలు చేసేముందు తాజా ధరలను తప్పనిసరిగా పరిశీలించాలి. రోజువారీ మార్పులను పరిగణనలోకి తీసుకుని, అవసరమైన సమయంలోనే పెట్టుబడులు పెట్టడం మేలని వారు తెలిపారు.

Also Read : Today Gold Price : నాన్ స్టాప్ గా దూసుకుపోతున్న పసిడి ధరలు

Exit mobile version