కొత్త పార్టీని ఏర్పాటు చేస్తా : హుమాయున్ క‌బీర్

స‌స్పెండ్ అయిన టీఎంసీ ఎమ్మెల్యే

hellotelugu-MLAHumayunKabir

కోల్ క‌తా : టీఎంసీ పార్టీ స‌స్పెండ్ చేసిన ఎమ్మెల్యే హుమాయున్ క‌బీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న షాకింగ్ కామెంట్స్ చేశారు. డిసెంబ‌ర్ 6న రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మ‌సీదును ప్రారంభిస్తానంటూ ప్ర‌క‌టించాడు. దీనిపై సీరియ‌స్ గా స్పందించింది టీఎంసీ పార్టీ. ఈ మేర‌కు ఆ పార్టీ చీప్‌, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆపై పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో తీవ్రంగా స్పందించారు త‌న‌ను స‌స్పెండ్ చేయ‌డం ప‌ట్ల‌. గురువారం హుమాయున్ క‌బీర్ మీడియాతో మాట్లాడారు. తాను రేపు పార్టీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. డిసెంబ‌ర్ 22న అధికారికంగా తాను స్వంతంగా పార్టీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపాడు.

అయితే పార్టీకి చెందిన జిల్లా అధ్య‌క్షుడు త‌న‌తో సంప్ర‌దించాల‌ని కోరార‌ని, ఆ మేర‌కు అక్క‌డికి వెళుతున్న‌ట్లు చెప్పారు. నేను జిల్లా అధ్యక్షుడితో సమావేశం కోసం ఇక్కడికి వచ్చాను, తరువాత స్పందన ఇస్తాను. కానీ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఎమ్మెల్యేగా కాదు, ముందుగా సమావేశం జరగనివ్వండి అని ఆయ‌న పేర్కొన్నారు. కోల్‌కతా మేయర్ , టీఎంసీ నాయకుడు ఫిర్హాద్ హకీమ్ స్పందిస్తూ హుమాయున్ క‌బీర్ వ్య‌వ‌హారం ప‌ట్ల అభ్యంత‌రం తెలిపారు. గ‌తంలో హెచ్చ‌రించి వదిలి వేసింది. కానీ తిరిగి ప్ర‌జ‌ల్లో భ‌యా భ్రాంతుల‌కు గురి చేసేలా బాబ్రీ మ‌సీదు గురించి మాట్లాడ‌టం ప‌ట్ల మంచి ప‌ద్ద‌తి కాద‌ని హిత‌వు ప‌లికింది.

Exit mobile version