TM BJP Interesting Updates : బీజేపీ ప్ర‌చారానికి శ్రీ‌కారం ఎన్నిక‌ల‌కు సిద్దం

అక్టోబ‌ర్ నెల‌లో రాష్ట్ర వ్యాప్త ప‌ర్య‌ట‌న

Hello Telugu - TM BJP Interesting Updates

Hello Telugu - TM BJP Interesting Updates

BJP : చెన్నై : వ‌చ్చే ఏడాది 2026లో త‌మిళ‌నాడులో జ‌రిగే శాస‌న స‌భ ఎన్నిక‌ల‌కు బీజేపీ (BJP) సిద్ద‌మవుతోంది. ఈ సంద‌ర్భంగా ఆ పార్టీ చీఫ్ నాగేంద్ర‌న్ పార్టీ బ‌లోపేతం పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా అక్టోబ‌ర్ నెల‌లో రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు పార్టీ తన ఉనికిని బలోపేతం చేసుకునే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇప్ప‌టికే అధికారంలో ఉన్న డీఎంకేను ఎలాగైనా ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది బీజేపీ. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అత్యంత బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న అన్నామలైని అనూహ్యంగా బీజేపీ అధ్య‌క్షుడి ప‌ద‌వి నుంచి త‌ప్పించింది. దూకుడు కాకుండా ప్ర‌జ‌ల్లో క‌లిసి పోయే నాయ‌క‌త్వం అవ‌స‌ర‌మ‌ని పార్టీ అధినాయ‌క‌త్వం భావించింది. ఇందులో భాగంగానే నైనార్ నాగేంద్ర‌న్ కు అధ్య‌క్ష ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది.

Tamil Nadu BJP Updates

గ్రామీణ, ప‌ట్ట‌ణ స్థాయిలలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌డం, విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డంపై దృష్టి సారించాల‌ని స్ప‌ష్టం చేశారు నాగేంద్ర‌న్. రాష్ట్రంలోని ఆయా శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించారు. ఈ విష‌యాన్ని భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారికంగా బుధ‌వారం వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా పార్టీ సందేశాన్ని నేరుగా అట్టడుగు వర్గాలకు తీసుకెళ్లడానికి, తీవ్రమైన ఎన్నికల యుద్ధానికి దాని క్యాడర్‌ను సిద్ధం చేయడానికి ఈ ప్రచారాన్ని రూపొందిస్తున్నారు. నియోజక వర్గాలలో బలమైన సంస్థాగత నిర్మాణాన్ని నిర్మించడం, బలమైన ఓటర్ల మద్దతు ఉన్న నాయకులను ముందంజలోకి తీసుకు రావడంపై ప్రణాళిక కేంద్రీకృతమై ఉంది.

Also Read : DY Speaker RRR Interesting Comments : న‌టి రితికా నాయ‌క్ బొమ్మ లాగా ఉంది

Exit mobile version