స‌స్పెండైన ఎన్. సంజయ్‌పై విచారణకు కమిటీ ఏర్పాటు

ఏపీలో స‌స్పెండ్ అయిన సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్

hellotelugu-NSanjayCID

అమ‌రావ‌తి : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గ‌తంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో కీల‌క పోస్టులో ఉన్నారు సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ ఎన్. సంజ‌య్. ఆయ‌న‌ను కూట‌మి స‌ర్కార్ స‌స్పెండ్ వేటు వేసింది. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఇవాళ విచార‌ణ క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అగ్ని వెబ్ పోర్టల్ రూపకల్పన, అభివృద్ధి , నిర్వహణలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, ఇతర అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు సంజయ్‌పై ఉన్నాయి. ఇందుకు సంబంధింఇ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విచారణ అధికారిని నియమించింది. చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ ఇందుకు సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేశారు అధికారికంగా. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ను విచారణ అధికారిగా నియ‌మించినట్లు పేర్కొన్నారు .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ , అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నప్పుడు అగ్ని వెబ్ పోర్టల్ పనులు, అభివృద్ధి, నిర్వహణలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని, అలాగే ఇతర అక్రమాలకు పాల్పడ్డారని సంజయ్‌పై ఆరోపణలు ఉన్నాయి. అలాగే, సీఐడీలో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పని చేస్తున్నప్పుడు షెడ్యూల్డ్ కులాలు , షెడ్యూల్డ్ తెగల వారికి బాధితుల హక్కులు , ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989’లోని నిబంధనలపై అవగాహన కల్పించేందుకు పోలీసు సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి కేటాయించిన నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ‘ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనలు, 1969’లోని రూల్ 8(2) ప్రకారం సంజయ్‌పై నమోదైన ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సంజయ్‌పై నమోదైన ఆరోపణలపై విచారణ అధికారి నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని చీఫ్ సెక్రటరీ ఉత్త‌ర్వుల‌లో పేర్కొన్నారు. సంజయ్‌ను తన తరఫున రాతపూర్వక వివరణ సమర్పించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, ఆయన అలా చేయలేదని తెలిపారు సీఎస్. 2023లో అప్పటి టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సమయంలో సంజయ్ సీఐడీ చీఫ్‌గా ఉన్నారు.

Exit mobile version