RRR : విజయవాడ : ఆయన బాధ్యత కలిగిన పదవిలో ఉన్నారు. కానీ నోరు జారారు. ఆయన ఎవరో కాదు ఏపి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు (RRR). టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాణంలో తీసిన మిరాయ్ దుమ్ము రేపుతోంది. భారీ ఎత్తున కలెక్షన్ల పంట పండిస్తోంది. ఇప్పటికే 5 రోజుల్లో లక్షకు పైగా టికెట్లు ఒక్క బుక్ మై షో ద్వారా అమ్ముడు పోయాయి. ఇక ఓవర్సీస్ లో అమెరికాలో 2 మిలియన్లు వచ్చాయి. రూ. 100 కోట్ల కలెక్షన్స్ పూర్తయినట్లు సమాచారం. ఎవరూ ఊహించని రీతిలో బిగ్ సక్సెస్ కావడంతో మిరాయ్ చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఏపీ డిప్యూటీ స్పీకర్.
DY Speaker RRR Comments
మిరాయ్ లో కీలక పాత్ర పోషించింది నటి రితికా నాయక్. ఆమెను ఉద్దేశించి రఘురామ కృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను బొమ్మలా కనిపస్తోందని, ఏఐ క్రియేషన్ లాగా ఉందంటూ పేర్కన్నారు. దీనిపై పలువురు అభ్యంతరం తెలిపారు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న తను ఇలా మాట్లాడితే ఎలా అని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. బహుశా పొగడ్తగా ఉద్దేశించినప్పటికీ లైంగిక వివక్షను వెల్లడించింది.
ప్రతిష్టాత్మకమైన రాజ్యాంగ పదవిని కలిగి ఉన్న నాయకుడి నుండి వచ్చిన ఈ వ్యాఖ్యలు ఎన్నికైన ప్రతినిధులలో లింగ సున్నితత్వం గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతున్నాయి. సినిమాల్లోని మహిళలు తమ అందానికి గుర్తింపు కోసం తీవ్రంగా పోరాడుతున్న కాలంలో, ఇలాంటి వ్యాఖ్యలు మరింత ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి.
Also Read : Mirai Movie Huge Collections : 5 రోజుల్లో లక్షకు పైగా మిరాయ్ టికెట్లు
