Tirupati Fire Accident Shocking : అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌రం

విచార‌ణ‌కు ఆదేశించిన తిరుప‌తి మేయ‌ర్

Hello Telugu - Tirupati Fire Accident Shocking

Hello Telugu - Tirupati Fire Accident Shocking

Tirupati : తిరుప‌తి – తిరుప‌తిలోని శ్రీ గోవిందరాజుల దేవాలయ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జ‌ర‌గ‌డం దురదృష్టక‌ర‌మ‌ని అన్నారు మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌. అగ్ని ప్రమాదాన్ని సకాలంలో నివారించిన తిరుపతి (Tirupati) విపత్తు నివారణ, అగ్నిమాపక అధికారులు , సిబ్బందిని అభినందించారు. ప్రమాదం చోటు చేసుకున్న సన్నిధి ప్రాంతాన్ని సందర్శించారు. నగర పాలక సంస్థ విపత్తు నివారణ, అగ్ని మాపక శాఖ అధికారి శ్రీనివాస రావుతో కలిసి అగ్ని ప్రమాదానికి గురైన షాపును, సన్నిధి వీధిలో ఉన్న ఇతర షాపులను సందర్శించి ఘటన కారణాలను అడిగి తెలుసుకున్నారు. షాపు నిర్వాహకులు అగ్నిప్రమాద శాఖ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం వద్దు ఆలయ ప్రాంతంలో భక్తుల సందర్శన ఉంటుంది కనుక ఈ ప్రాంతంలో ఉన్న షాపులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tirupati Fire Accident Updates

అదే సమయంలో గోవిందరాజుల దేవాలయ ప్రాంతంలో జరిగిన ఘటన నేపథ్యంలో నగరంలోని కీలక ప్రాంతాలలో ఉన్న షాపులలో నిబంధనలు పాటించే విధంగా చూడాలని మొత్తం నగర పరిధిలో వాస్తవ పరిస్థితితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌. తిరుప‌తి నగరం శ్రీవారి భక్తులు సందర్శించే ప్రాంతం కనుక ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. షాపు నిర్వాహకులకు తగిన జాగ్రత్తలు తీసుకునేలా చైతన్యం కల్పించాలని అదే సమయంలో నిబంధనలు పాటించే విషయంలో రాజీ ధోరణి ఉండ కూడదన్నారు. అగ్ని ప్రమాదానికి గురి అయిన షాపుతో సహా మొత్తం పరిస్తితి పై నివేదిక ఇవ్వాలని నగర పాలక సంస్థ విపత్తు నివారణ శాఖను ఆదేశించారు.

Also Read : Air India Shocking Again : మధ్యలో ఆగిపోయిన ఢిల్లీ – వాషింగ్టన్ డీసీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం

Exit mobile version