Tirupati : అమరావతి : ఏపీ కూటమి సర్కార్ తాజాగా ఓ ఉద్యోగిపై తీసుకున్న చర్య పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అమరావతిలో వరదల చిత్రాలను పోస్ట్ చేసినందుకు ప్రభుత్వ అధికారి సుభాష్ చంద్ర బోస్ ని సస్పెండ్ చేయడం చర్చకు దారితీసేలా చేసింది. సిద్ధార్థి సుభాస్ చంద్రబోస్ వాణిజ్య పన్నుల శాఖ తిరుపతిలో (Tirupati) ప్రాంతీయ ఆడిట్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ (ఎఫ్‌ఏసీ)గా పనిచేస్తున్నారు. ఆయన ఫేస్‌బుక్‌లో అమరావతిలో ముంపునకు గురైన పొలాల చిత్రాలను పంచుకున్నారు. ఇది మన డ్రోన్ రాజధాని, ఇది మన క్వాంటం వ్యాలీ. నగరంలో అతిపెద్ద రైల్వే స్టేషన్, విమానాశ్రయం రావాల్సి ఉంది. అయినప్పటికీ, ఒక్క వర్షం కురిసినా అమరావతి పూర్తిగా మునిగి పోతుంది అని పోస్ట్ చేశారు. సర్కార్ నిర్వాకం గురించి ప్రశ్నించారు.
Tirupati GST Officer Suspension
మరొక పోస్ట్‌లో సఖుమూరు, నీరుకొండ, కృష్ణాయపాలెంలలో మూడు జలాశయాలను నిర్మిస్తున్న రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ పై వచ్చిన వార్తా నివేదికను ఆయన హైలైట్ చేశారు. అమరావతిని కేవలం జలాశయంగా నిర్మించడం మంచిది కాదా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాగా రెండు పోస్టులు గత ఆగస్టు 18న షేర్ చేశారు. ఈ పోస్టులను సర్కార్ తీవ్రంగా పరిగణించింది. ఆయన ప్రభుత్వ అధికారి అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో సంతృప్తి చెందని సర్కార్ తనను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజాస్వామికవాదులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. కవులు, రచయితలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : S Jaishankar Important Comments : ఐక్య రాజ్యసమితిలో సంస్కరణలు రావాలి
