Tirumala Brahmotsavam Interesting Update : సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం

ఫైర్ సర్వీసెస్, ఎస్పీఎఫ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు...

Hello Telugu - Tirumala Brahmotsavam Interesting Update

Hello Telugu - Tirumala Brahmotsavam Interesting Update

Tirumala : తిరుమలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాట్లు చక్కబెట్టేందుకు టీటీడీ (Tirumala) చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీ & ఎస్వో) శ్రీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో శనివారం అన్నమయ్య భవనంలో విజిలెన్స్, ఫైర్ సర్వీసెస్, ఎస్పీఎఫ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో తొలిదినం ముఖ్యమైన ఘట్టంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వయంగా శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో, సీఏంని కలిసే కార్యక్రమానికి భద్రతా పరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Tirumala – గత అనుభవాల ఆధారంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

శ్రీ మురళీకృష్ణ మాట్లాడుతూ, గత సంవత్సరాల్లో బ్రహ్మోత్సవాల సమయంలో ఎదురైన పరిస్థితులను విశ్లేషిస్తూ ఈసారి మరింత సమగ్ర భద్రతా వ్యవస్థ అమలు చేయాలన్నారు. తిరుమలలోని (Tirumala) ప్రతి మూలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా టెక్నాలజీ ఆధారిత నిఘా కొనసాగించాలన్నారు.

ముఖ్యమైన వేడుకలకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు

బ్రహ్మోత్సవాల్లో ప్రధాన రోజులుగా భావించే పెద్దశేష వాహన సేవ, గరుడ వాహనం, రథోత్సవం, చక్రస్నానం కార్యక్రమాల్లో భద్రతను మరింత బలపరచాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే వేళల్లో ఎలాంటి అప్రమత్తత లోపించకూడదని స్పష్టంచేశారు.

భక్తులకు సౌకర్యవంతమైన దర్శనానికి ప్రణాళికలు

వాహనసేవలు తిలకించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన ప్రణాళికతో గ్యాలరీలు, ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రద్దీకి తగినట్లుగా ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటుచేయాలని విజిలెన్స్, ట్రాఫిక్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో టీటీడీ విజిలెన్స్ అండర్ సెక్రటరీలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్రతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో భద్రతతో పాటు భక్తులకు ఉత్తమమైన సేవలు అందించేందుకు టీటీడీ చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

Also Read : TTD – Elephants Interesting : ఏడుకొండలవాడి సేవలో వైభవంగా ఏడుగురు గజరాజులు

Exit mobile version