Tirumala Darshanam Easy : నేటి నుంచి మరింత సులభంగా శ్రీవారి దర్శనం

తాజా నిర్ణయం ప్రయోగాత్మకంగా రెండు వారాలపాటు అమలులో ఉంటుంది...

Hello Telugu - Tirumala Darshanam Easy

Hello Telugu - Tirumala Darshanam Easy

Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన శ్రీవాణి టికెట్ల విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మార్పులు చేసింది. ఆగస్టు 1వ తేదీ నుండి టికెట్ కొనుగోలు చేసిన రోజునే దర్శనం కల్పించే విధానాన్ని ప్రారంభించనుంది. గతంలో శ్రీవాణి టికెట్ ద్వారా దర్శనానికి మూడురోజుల గడువు ఉండేది. తాజా నిర్ణయం ప్రయోగాత్మకంగా రెండు వారాలపాటు అమలులో ఉంటుంది.

Tirumala Darshnam Update

ప్రారంభంలో తిరుమల (Tirumala), తిరుపతి విమానాశ్రయాల్లో ఉన్న ఆఫ్‌లైన్ బుకింగ్ కౌంటర్లలో ఈ కొత్త విధానం అమలవుతుంది. తిరుమలలో రోజుకు సుమారు 800 టికెట్లు, తిరుపతి విమానాశ్రయంలో 200 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి.

ఆగస్టు నెలలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలు:

ఈ మార్పులతో భక్తులకు తక్షణ దర్శనంలో సౌలభ్యత కలగనుంది. పర్వదినాల నేపథ్యంలో భక్తుల రద్దీని పరిగణలోకి తీసుకుని టీటీడీ ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది.

Also Read : TTD EO New Innovation : టీటీడీ సౌభాగ్యంకు విస్తృత ఏర్పాట్లు – ఈవో

Exit mobile version