Tirumala Rains Sensational : తిరుమ‌ల‌లో క‌ళ క‌ళ లాడుతున్న జ‌లాశ‌యాలు

తిరుమ‌ల‌లో మూడు రోజులుగా భారీ వ‌ర్షాలు

Hello Telugu - Tirumala Rains Sensational

Hello Telugu - Tirumala Rains Sensational

Tirumala : తిరుమల : తిరుమలలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. తిరుమలలో (Tirumala) పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. వరద నీటి ప్రవాహంతో మొత్తం ఐదు జలాశయాల్లోకి నీరు చేరుకుంటోంది. గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండి పోవడంతో ఒక గేటును తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్ర‌స్తుత నీటి నిల్వ‌లు తిరుమ‌ల‌కు 215 రోజుల తాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిపోతాయని తెలిపింది టీటీడీ పాల‌క మండ‌లి. ఉదయం 8 గంటల సమయానికి జలాశయాల నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.

Tirumala Rains Update

పాపవినాశనం డ్యామ్ లో 696.05 మీ ఉండ‌గా ఎఫ్ఆర్ఎల్ 697.14 మీ ఉంది. ఇక నిల్వ సామ‌ర్థ్యం
5240.00 ల‌క్ష‌ల గ్యాలన్లు ఉండ‌గా ప్ర‌స్తుత నిల్వ 4890.65 ల‌క్ష‌ల‌ గ్యాలన్లకు చేరుకుంది. ఇక గోగర్భం డ్యామ్ 2893.80 అడుగులకు చేరుకుంది. ఎఫ్ఆర్ఎల్ 2894.00 అడుగుల వ‌ద్ద నీరు నిలిచి ఉంది. ఇక డ్యాం నీటి నిల్వ సామ‌ర్థ్యం 2833.00 ల‌క్ష‌ల గ్యాలన్లు ఉండ‌గా ప్ర‌స్తుతం నీటి నిల్వ 2804.89 ల‌క్ష‌ల‌ గ్యాలన్లుగా ఉంది. ఇక ఆకాశ గంగ డ్యామ్ నీటి నిల్వ 863.10 మీట‌ర్ల వ‌ద్ద‌కు చేరుకుంది. ఎఫ్ఆర్ఎల్ 865.00 మీట‌ర్ల వ‌ద్ద ఉంది. ఇక డ్యామ్ నిల్వ సామ‌ర్థ్యం 685.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు ఉండ‌గా ప్ర‌స్తుత నిల్వ 537.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లకు చేరుకుంద‌ని టీటీడీ వెల్ల‌డించింది.

కుమారధార డ్యామ్ 896.15 మీట‌ర్ల‌కు చేరుకోగా ఎఫ్ఆర్ఎల్ 898.24 మీట‌ర్ల వ‌ద్ద ఉంది. నీటి నిల్వ సామ‌ర్థ్యం 4258.98 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు కాగా ప్ర‌స్తుత నిల్వ 3739.05 ల‌క్ష‌ల‌ గ్యాలన్ల వ‌ద్ద నీరు ఉంది. పసుపుధార డ్యామ్ 893.20 మీట‌ర్లు ఉండ‌గా ఎఫ్ఆర్ఎల్ 898.24 మీట‌ర్ల వ‌ద్ద ఉంది. ఇక నీటి నిల్వ సామ‌ర్థ్యం 1287.51 ల‌క్ష‌ల గ్యాలన్లు ఉండ‌గా ప్ర‌స్తుత నీటి నిల్వ 548.16 ల‌క్ష‌ల గ్యాలన్లకు చేరుకుంది.

Also Read : IT Minister Nara Lokesh – AP Growth : రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆరంభం మాత్రమే

Exit mobile version