IT Minister Nara Lokesh – AP Growth : రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆరంభం మాత్రమే

అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానం

Hello Telugu - IT Minister Nara Lokesh - AP growth

Hello Telugu - IT Minister Nara Lokesh - AP growth

Nara Lokesh : మెల్ బోర్న్ (ఆస్ట్రేలియా): ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆరో రోజు ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో మెల్ బోర్న్ లోని గ్రాండ్ హయత్ హోటల్ ది రెసిడెన్సీ హాల్ లో నిర్వహించిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ కు ఆహ్వానించినందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. దేశంలో పెట్టుబడుల గమ్య స్థానంగా ఆంధ్రప్రదేశ్ ను ఎందుకు పరిగణించాలో మూడు ప్రధాన కారణాలు చెప్పారు. ఏపీలో అనుభవం కలిగిన దార్శనిక నాయకత్వం ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారని తెలిపారు.

IT Minister Nara Lokesh Key Comments on Investments

పెద్ద ప్రాజెక్టులను రాష్ట్రానికి ఎలా తీసుకు రావాలో ఆయనకు బాగా తెలుస‌న్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉందన్నారు. దీనివల్ల దేశంతో పాటు ఏపీలో కూడా సాఫీగా పెట్టుబడులు పెట్టేందుకు మీకు సహకారం లభిస్తుందని చెప్పారు నారా లోకేష్ (Nara Lokesh) . ఏపీలో 50శాతం మంది ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికయ్యారు. 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారు ఉన్నారు. రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపేందుకు మేమంతా కసితో పని చేస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్‌. ఏపీ స్టార్టప్ స్టేట్. చేపట్టిన పనులు పూర్తి చేయాలనే ధృడసంకల్పంతో ఉన్నామన్నారు.

మీరు ఒకసారి మాతో చేతులు కలిపిన తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు మన ప్రాజెక్ట్ అని గుర్తు పెట్టుకోవాల‌న్నారు. మొదటగా మేం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఆయా ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారులు, నాయకులతో నిరంతరం ప్రాజెక్ట్ పురోగతిపై రోజువారీ పద్ధతిలో చర్చిస్తాం. ప్రాజెక్ట్ ఏ దశలో ఉందో, ఏం చేయాలో తెలుసుకుంటాం. ఉదాహరణకు ఆతిథ్య సేవల రంగంలో ఈ రోజు ఉదయం ఓ కంపెనీకి భూమి కేటాయింపు ప్రస్తుత పరిస్థితి, ఫైల్ ఎక్కడ ఉందో, క్లియరెన్స్ ఎప్పుడు వస్తుందో అన్న వివరాలు పంపించాం. ఇచ్చిన హామీని అమలు చేయడం మాకు చాలా ముఖ్యం. మీ ప్రాజెక్ట్ ను నిరంతరం ఫాలో అప్ చేస్తాం. మీరు నిర్దేశించిన సమయం కంటే వేగంగా పూర్తిచేయడమే మా లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు.

Also Read : DIG Koya Praveen Important Update : బ‌స్సు ఘ‌ట‌న‌పై డీఐజీ కోయ ప్ర‌వీణ్ కామెంట్స్

Exit mobile version