Simhachalam Giri Pradakshina : విశాఖపట్నం – సింహాచలం శ్రీ వరాహా లక్ష్మి నృసింహా స్వామి గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని సమిష్టి గా విజయవంతం చేద్దామని జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ ఆకాంక్షించారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అధ్వర్యంలో రూపొందించిన ప్రణతోస్మి గిరి పౌర్ణమి ఆల్బమ్ ను మంగళవారం గ్రేటర్ కమిషనర్ కేతన్ గార్గ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
Simhachalam Giri Pradakshina Updates
ఈ సందర్భంగా కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భక్తి భావంతో ముందుకు సాగుదామన్నారు. గిరి ప్రదక్షిణ (Simhachalam Giri Pradakshina) సందర్బంగా ప్రణతోస్మి గిరిపౌర్ణమి ప్రత్యేక ఆల్బమ్ ను రూపొందించడం అభినందనీయమన్నారు. ఇటువంటి భక్తి గీతాలతో భక్తులలో మరింతగా భక్తి భావాలు పెరుగుతాయన్నారు.
ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రహ్లాదుడు రక్షణార్దం సింహగిరి పై వెలిసిన సింహాద్రినాధుడు అత్యంత మహిమాన్వితుడన్నారు. సింహగిరి ప్రదక్షిణ భూపల ప్రదక్షిణ తో సమానమన్నారు. తన చిన్న నాటి నుంచి అనేక ఏళ్ళుగా గిరిప్రదక్షిణ ఉత్సవం లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక ఆల్బమ్ కు రచన, స్వరకల్పన చేసిన జయప్రభ శర్మ మాట్లాడుతూ గత కొన్నేళ్ళుగా అప్పన్న ఉత్సవాలకు సంబంధించిన పాటలను సమకూర్చే అవకాశం కలగడం స్వామి అనుగ్రహం గా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ భక్తి గీతానికి అఖిల, సత్య శ్రీ గానం చేయగా శ్రీ వరాహా లక్ష్మి నృసింహా స్వామి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుడివాడ శ్రీనివాసరావు, భక్తులు కేతినీడి సాయి కుమార్, భోకం శ్రీను, తదితరులు పాల్గొన్నారు. ఎస్.వి.ఎన్.ఎస్ భక్తి చానల్ ద్వారా ఈ ప్రత్యేక భక్తి గీతాన్ని విడుదల చేశారు.
Also Read : Shakambari Utsvalu Interesting Updates : ఇంద్రకీలాద్రిపై 3 రోజులు అంగరంగ వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు
