కావాల‌ని మ‌మ్మ‌ల్ని టార్గెట్ చేశారు : మారుతి

త‌న రాజా సాబ్ మూవీ స‌క్సెస్ సాధిస్తుంది

hellotelugu-DirectorMaruti

హైద‌రాబాద్ : హార‌ర్ , కామెడీ క‌థ‌ల‌తో సినిమాల‌కు పేరు పొందిన ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం రాజాసాబ్ పై స్పందించాడు. ఇందులో పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్, మాళ‌విక మోహ‌న్, నిధి అగ‌ర్వాల్ , రిద్దీ కుమారి , సంజ‌య్ ద‌త్ క‌లిసి న‌టించారు. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆశించిన స్థాయిలో సినిమా లేదంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ కొన‌సాగుతోంది సోష‌ల్ మీడియా వేదిక‌గా. పెద్ద ఎత్తున ట్రోల్స్ కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇదే క్ర‌మంలో ప‌లు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. వాటిలో మెగాస్టార్ న‌టించిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. న‌వీన్ పోలిశెట్టి, చాందిని చౌద‌రి క‌లిసి న‌టించిన అన‌గ‌న‌గా ఒక రోజు చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది.

అయితే ప్ర‌భాస్ న‌టించిన రాజా సాబ్ మాత్రం మిక్స్ డ్ టాక్ తో తీవ్ర నిరాశ ప‌రిచింది. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూనే ఉన్నారు ద‌ర్శ‌కుడు మారుతి. తాను ఒక జాన‌ర్ లో ప్ర‌భాస్ ను చూపించాల‌ని అనుకున్నాన‌ని కానీ కావాల‌ని త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకుని కొంద‌రు ఇండ‌స్ట్రీలో దాడులు చేయ‌డం మొద‌లు పెట్టారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు డైరెక్ట‌ర్. బుధ‌వారం ఆయ‌న సామాజిక మాధ్య‌మం వేదిక‌గా స్పందించాడు. సమయం ఎల్లప్పుడూ స్పష్టతను తెస్తుందని, నిజాయితీగల పని ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకున్నా చివరికి దాని స్థానాన్ని కనుగొంటుందని మారుతి అన్నారు.

Exit mobile version