సరైన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటా : త్రిష

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన అందాల ముద్దుగుమ్మ

hellotelugu-Trishaakrisshnan

చెన్నై : త‌మిళ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన అందాల తార త్రిష కృష్ణ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె అగ్ర న‌టుడు, రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తో కొంత కాలం పాటు స‌న్నిహితంగా ఉన్నారు. ఆమె త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోనున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఎన్నిక‌ల‌కు ముందు ఈ ఇద్ద‌రు చెట్టాప‌ట్టాల్ వేసుకుని తిరిగారు. వేడుక‌ల‌కు కూడా హాజ‌ర‌య్యారు. త‌ను భార్య సంగీత‌తో విడిగా ఉన్నారు. ఈ ఇద్ద‌రూ త‌మ‌కు విడాకులు కావాల‌ని కోర్టును ఆశ్ర‌యించారు. ఎన్నిక‌ల అనంత‌రం విజ‌య్ పార్టీ భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. కానీ ఏమైందో ఏమో కానీ ఉన్న‌ట్లుండి విజ‌య్, త్రిష సైలెంట్ అయి పోయారు.

తాజాగా త్రిష దీనిపై స్పందించింది. ప‌రోక్షంగా తామిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి బంధం లేద‌ని తేల్చి చెప్పింది. పెళ్లి గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది త్రిష కృష్ణ‌న్. నటి త్రిష వివాహంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు, ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఈ ప్రముఖ దక్షిణాది నటి, వివాహం అనేది జీవితకాల బంధమని, దానిని తేలికగా తీసుకోకూడదని పేర్కొన్నారు. తన వివాహం గురించి తరచుగా వచ్చే పుకార్లపై త్రిష స్పందించారు. ఒకవేళ తాను పెళ్లి చేసుకుంటే అది జీవితకాలం నిలిచిపోయేలా ఉండాలని, విడాకులతో ముగిసే బంధంలోకి అడుగు పెట్టడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పారు.

Exit mobile version