హైదరాబాద్ : బహుళ భాషల నటి సమంత రుత్ ప్రభు సంచలనంగా మారారు. ఇటీవలే తను ఎవరికీ తెలియకుండా దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమూరును పెళ్లి చేసుకుంది. కర్ణాటకలోని జగ్గీ వాసుదేవన్ కు చెందిన ఆశ్రమంలోని ఆలయంలో కొందరు కుటుంబీకులు, స్నేహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఆ తర్వాత సినిమాలకు సంబంధించి తను కొంత కాలం గ్యాప్ తీసుకుంది. ఈ సమయంలో ఉన్నట్టుండి నందిని రెడ్డి దర్శకత్వం వహించిన మా ఇంటి బంగారం మూవీలో కీ రోల్ పోషించింది. అత్యంత తక్కువ బడ్జెట్ లో తీసిన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా రూ. 80 కోట్లు వసూలు సాధించింది. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రధానంగా ఉమెన్ ఓరియెంటెడ్ సినిమా కావడం, సమంత కడుపుతో ఉండి అద్భుతంగా నటించింది. ఇతర నటీనటులు ఆశ్చర్య పోయేలా ఫుల్ మార్కులు కొట్టేసింది.
తాజాగా తాను కడుపుతో ఉన్నానని అధికారికంగా ప్రకటించింది సమంత రుత్ ప్రభు. ఇందుకు సంబంధించిన బేబి డంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం తను వైరల్ గా మారింది. ఈ సందర్బంగా తన పోస్ట్‌కు కాస్త హాస్యాన్ని జోడిస్తూ ఆమె ఇలా రాసింది నా సిక్స్-ప్యాక్ మళ్లీ కలుద్దాం. ఇదిలా ఉండగా సమంత, ఆమె భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరు తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు. సమంత, తన బేబీ బంప్‌ను గర్వంగా ప్రదర్శిస్తూ తీయించుకున్న ఒక అందమైన ఫోటోను పంచుకుని అభిమానులను అలరించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్‌లో, సమంత తన గర్భధారణ విషయాన్ని ధృవీకరించారు. అలాగే, పని నుండి విరామం తీసుకుని ప్రసూతి సెలవు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు.
