హైదరాబాద్ : రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, మాజీ భారత జట్టు కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను క్రికెట్ ను ఆడే సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాలు లేవన్నారు. ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారి పోయాయని చెప్పారు. తనకు ఆనందంగా ఉందన్నారు ఇందులో పాల్గొనడం. ఒక క్రికెటర్ గా , ఆటగాడిగా, భారత జట్టు మాజీ కెప్టెన్ గా, మంత్రిగా . ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందులు పడ్డానని చెప్పారు.
తెలంగాణలో స్పోర్ట్స్ కు మెరుగైన అవకాశాలున్నాయని అన్నారు మహమ్మద్ అజారుద్దీన్. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫుట్ బాల్ ప్లేయర్ కావటం విశేషం అన్నారు. మంచి ప్లేయర్ అనుకుంటే తన ఫ్యామిలీ కష్టాలు ఎన్ని ఉన్నా అవి భరించే సిస్టం ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుందని స్పష్టం చేశారు. యువ క్రీడా ప్రతిభను పెంపొందించడం, అట్టడుగు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం , అథ్లెట్లు రాణించడానికి కొత్త మార్గాలను సృష్టించడం పట్ల తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించబడిన నిబద్ధత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు మహమ్మద్ అజారుద్దీన్.
