టి20 జ‌ట్టుకు గిల్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేదు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కార్తీక్ మెహింద్రు

hellotelugu-ShubhmanGill

ముంబై : శుభ్ మ‌న్ గిల్ ను టి20 జ‌ట్టుకు కెప్టెన్ చేయ‌నున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక సోష‌ల్ మీడియాలో గిల్ అభిమానులు సైతం హోరెత్తిస్తున్నారు. ప్ర‌స్తుతం సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలో టీం ఇండియా వ‌రుస‌గా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను చేజిక్కించుకుంది. అరుదైన రికార్డును న‌మోదు చేసింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ నేష‌న‌ల్ హీరోగా మారాడు. త‌న‌ను జ‌ట్టులో ఎంపిక చేసినప్ప‌టికీ మొద‌టి నాలుగు మ్యాచ్ ల‌కు దూరం పెట్టారు. అభిషేక్ శ‌ర్మ‌కు అనారోగ్యం క‌ల‌గ‌డంతో త‌న‌కు ఛాన్స్ ద‌క్కింది అనుకోకుండా. దీంతో న‌మీబియాతో 22, జింబాబ్వేతో 24, విండీస్ తో 97 , ఇంగ్లండ్ తో 89, ఫైన‌ల్ లో న్యూజిలాండ్ పై 89 ప‌రుగుల‌తో స‌త్తా చాటాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ గా ఎంపిక‌య్యాడు.

ఈ త‌రుణంలో త‌న‌ను సెకండ్ ఆప్ష‌న్ గా చూస్తున్న‌ట్లు స‌మాచారం. కానీ ఉన్న‌ట్టుండి గిల్ పేరు ఎక్కువ‌గా వినిపిస్తుండ‌డంతోక్రికెట్ రీల్స్ తయారు చేసే కార్తీక్ మెహింద్రు స్పందించాడు. ఈ ఐపీఎల్ శుభ్‌మన్ గిల్‌కు చాలా ముఖ్యమైనదని ,అతను బాగా రాణిస్తే, అతను అందరినీ తప్పుగా నిరూపించి భారత టీ20ఐ జట్టుకు రాజు అవుతాడని చెబుతున్నాడు.గిల్ తిరిగి వస్తే టీ20ఐ జట్టులో ఎక్కడ సరిపోతాడు? సంజు సామ్సన్ స్థానంలో అతను ఉంటాడా? అవకాశం లేదు. అభిషేక్ శర్మ స్థానంలో అతను ఉంటాడా? అసాధ్యం. లేదా ఇషాన్ కిషన్ స్థానంలో అతను ఉంటాడా? గిల్ కు అంత సీన్ లేదు. ఇప్పటికే 200+ స్ట్రైక్ రేట్‌లతో స్థిరపడిన టాప్ ఆర్డర్ ఉన్నప్పుడు, 130 స్ట్రైక్ రేట్‌తో ఆడే గిల్ లాంటి అర్హత లేని ఆటగాడిని ఎందుకు తీసుకు రావాలని ప్ర‌శ్నిస్తున్నారు మాజీ క్రికెట‌ర్లు, ఫ్యాన్స్.

Exit mobile version