PM Modi Sensational Comments : ప్ర‌పంచానికి యుద్దం కాదు శాంతి కావాలి – మోదీ

బ్రిక్స్ స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి కీల‌క కామెంట్స్

Hello Telugu - PM Modi Sensational Comments

Hello Telugu - PM Modi Sensational Comments

PM Modi : ఈ ప్ర‌పంచానికి యుద్దం కాదు కావాల్సింది శాంతి కావాల‌ని అన్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi). బ్రిక్స్ వేదిక‌గా జ‌రిగిన అంత‌ర్జాతీయ వేదిక‌పై ప్ర‌సంగించారు. ప్ర‌ధానంగా వాతావ‌ర‌ణ మార్పు, ఆరోగ్య భ‌ద్ర‌త వంటి కీల‌క అంశాల‌పై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. వచ్చే ఏడాది బ్రిక్స్‌కు దేశం అధ్యక్షత వహించడం ఆనందంగా ఉంద‌న్నారు. త‌మ దేశం కావాల‌ని ఏ దేశంతో యుద్దానికి దిగ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. కానీ పొరుగు దేశ‌మైన పాకిస్తాన్ కావాల‌ని క‌య్యానికి కాలు దువ్వుతోంద‌ని ఆరోపించారు. అందుకే తాము ఆప‌రేష‌న్ సిందూర్ ను ప్ర‌యోగించ‌డం జ‌రిగింద‌న్నారు. కాళ్ల బేరానికి రావ‌డంతో యుద్దాన్ని ఆపామ‌ని పేర్కొన్నారు మోదీ.

PM Modi Sensational Comments

భార‌త‌దేశంలో జ‌రిగే బ్రిక్స్ స‌మావేశం పూర్తిగా మాన‌వ‌త్వానికి ప్రాధాన్య‌త అనే అంశం ప్రాతిప‌దిక‌న నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు ప్ర‌ధాన‌మంత్రి. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాతో ఇండియా – బ్రెజిల్ సంబంధాల‌పై చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ఆనందంగా ఉంద‌న్నారు. పర్యావరణం , ఆరోగ్య భద్రత వంటి కీలక అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామ‌న్నారు. ఈ సంద‌ర్బంగా బ్రిక్స్ ను ప్ర‌శంసించారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. భారతదేశానికి వాతావరణ న్యాయం కేవలం ఒక ఎంపిక కాదు, అది ఒక నైతిక బాధ్యత అని నొక్కి చెప్పారు. భారతదేశం తన ఎజెండాలో ప్రపంచ దక్షిణాదికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు లూలానాను ప్ర‌ధాన‌మంత్రి అభినందించారు.

Also Read : YSR Death Anniversary : మ‌ర‌ణం లేని నాయ‌కుడు వైఎస్సార్

Exit mobile version