దావోస్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఫోరం ప్రతినిధులకు కీలక సూచనలు చేశారు. ఈసారి డబ్ల్యూఈఎఫ్ సదస్సును హైదరాబాద్ లో నిర్వహించాలని కోరారు. ఇదిలా ఉండగా సీఎం చేసిన జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు ప్రపంచ వ్యాపార నాయకులు, విధాన నిర్ణేతల నుండి ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. సీఎం దన్యవాదాలు తెలిపారు.
ఆధునిక వ్యాపార చక్రాలు, పెట్టుబడి నిర్ణయాల ప్రక్రియలో తదుపరి చర్యల కోసం ఒక సంవత్సరం చాలా సుదీర్ఘ సమయమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టు నెలలో హైదరాబాద్‌లో ఒక వార్షిక ఫాలో-అప్ ఫోరమ్‌ను నిర్వహించాలని ప్రతిపాదించారు. వచ్చే జూలైలో డబ్ల్యూఎఫ్ ఫోరమ్‌ను హైదరాబాద్‌కు తీసుకు రావడానికి ఈ ప్రయత్నంలో నాతో చేరాలని నేను మిమ్మల్ని కోరుతున్నానని పేర్కొన్నారు.
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం అయ్యిందని చెప్పారు. దీని ద్వారా రూ. 5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించబడ్డాయని ఆయన తెలిపారు. సాధారణంగా తాము అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడానికి దావోస్‌కు వస్తామని అన్నారు. కానీ ఈ సంవత్సరం, గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ విజయం తర్వాత, తాము మా దార్శనికత ,విధానాలను వివరించడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.


















