సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి సెటైర్

స‌రిగా గోల్ కూడా కొట్ట‌లేక పోయాడంటూ ఎద్దేవా

hellotelugu-KiranRijijuMockss

హైద‌రాబాద్ : ప్ర‌భుత్వ ఖ‌జానాకు గండి కొడుతూ వ్య‌క్తిగ‌త ప్ర‌చారం చేసుకోవ‌డంలో ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాడు సీఎం రేవంత్ రెడ్డి. ప్ర‌తి పైసా ప్ర‌జ‌ల‌ది. కానీ తాను, త‌న కుటుంబీకులు, ఇత‌ర పార్టీకి చెందిన నేత‌లకు ప్ర‌యారిటీ ఇస్తూ అడ్డ‌గోలుగా ప్ర‌జా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ విమ‌ర్శ‌లు చేసింది. ఇందుకు త‌గ్గ‌ట్టుగానే హైద‌రాబాద్ లో ప‌ర్య‌టించి వెళ్లిన ఫుట్ బాల్ దిగ్గ‌జం మెస్సీ ఒక నిమిషం వీడియో క్లిప్ ను త‌న ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా వైర‌ల్ గా మారింది. మెస్సీతో ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు దిగ‌డం, త‌ను బాల్ అందిస్తే దానిని అడ్డ‌దిడ్డంగా కొట్ట‌డం ఇవ‌న్నీ ఎబ్బెట్టుగా అనిపించాయి. మెస్సీని హైద‌రాబాద్ కు తీసుకు రావ‌డం వ‌ల్ల త‌న ఇమేజ్ తో పాటు న‌గ‌రం ఇమేజ్ పెరుగుతుంద‌ని ప్ర‌చారం చేశారు. కానీ అందుకు భిన్నంగా మెస్సీ షేర్ చేసిన వీడియోలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక్క ఫోటో కానీ, వీడియో కానీ లేక పోవ‌డం బిగ్ షాక్ కు గురి చేసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు మెస్సీ హైద‌రాబాద్ టూర్ కు సంబంధించి ప్ర‌భుత్వ ప‌రంగా ఎంత ఖ‌ర్చు చేశార‌నేది వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు. దీనిపై నోరు మెద‌ప లేదు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం దీనిని చేప‌ట్టారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు . ఇక సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ చుట్టూ తిరుగుతూ, ఏదో పెద్ద ఘనత సాధించినట్టు హడావిడి చేసినా… చివరికి మెస్సీ మాత్రం పూర్తిగా లైట్ తీసుకోవ‌డం విస్మ‌యానికి గురి చేసింది. మెస్సీ తన ఇండియా టూర్‌కు సంబంధించిన అన్ని మూమెంట్స్‌ను కలిపి వీడియో రిలీజ్ చేశాడు . ఆ వీడియోలో ఒక్క చోట కూడా రేవంత్ రెడ్డి కనిపించలేదు. ఒక్క నిమిషం వీడియోలో అన్ని ముఖ్యమైన క్షణాలు ఉన్నాయి… కానీ ఆయనతో ఉన్న క్లిప్స్, ఆయనతో ఆడిన దృశ్యాలు, మెస్సీకి దగ్గరగా ఉన్న ఫుటేజ్ మాత్రం ఎక్కడా లేవు. ఎంత హడావిడి చేసినా, చివరికి కూరలో కరివేపాకులా తీసేసినట్టే అయింది.

Exit mobile version