తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు

హైద‌రాబాద్ న‌గ‌ర‌మంత‌టా కుండ‌పోత

hellotelugu-HeavyRains

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఉప్పల్, కాప్రా, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, ఘట్‌కేసర్ , అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాలతో సహా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉదయం పూట వర్షం కురిసింది. అర్ధరాత్రి నుండి ఉదయం వేళల వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్ల‌డించింది ఐఎండీ. వర్షం పడే అవకాశం ఉన్న జిల్లాల్లో సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, సిద్దిపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, నల్గొండ, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ , వరంగల్ జిల్లాలు ఉన్నాయి.

ఇదిలా ఉండ‌గా తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావ‌ర‌ణ శాఖ‌. యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి , మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది; రాబోయే మూడు గంటల్లో ఈ వర్షాలు భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ , మరికొన్ని జిల్లాలకు విస్తరించే అవకాశం ఉంది. మరోవైపు, ఉప్పల్, కాప్రా, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, ఘట్‌కేసర్ , అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాలతో సహా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉదయం పూట వర్షం కురిసింది. హైదరాబాద్‌లో వాతావరణ పరిస్థితులు ఉదయానికి మెరుగుపడే అవకాశం ఉంది, నగర వ్యాప్తంగా అక్కడక్కడా వర్షం లేదా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

Exit mobile version