హైదరాబాద్ : ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు యువ ఆపద మిత్రులు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు ఒకే రకమైన విధులు నిర్వహిస్తారని అన్నారు హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య. డీఆర్ ఎఫ్ వాళ్లు డ్యూటీ డ్రెస్ వేసుకుంటారు.. యువ ఆపద మిత్రులు రోజూ వేసకునే దుస్తులు దరిస్తారు. సేవలన్నీ సేమ్ టు సేమ్`అని అన్నారు. విపత్తుల సమయంలో తమను తాము కాపాడు కోవడమే కాకుండా.. చుట్టు పక్కల ఉన్నవారిని కూడా రక్షించాలనే లక్ష్యంతో హైడ్రా ఆధ్వర్యంలో ఫతుల్గూడలో నిర్వహించిన ‘యువ ఆపద మిత్ర’ పథకం రెండో బ్యాచ్ శిక్షణను ప్రారంభించి ప్రసంగించారు. వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి వివిధ కళాశాలలకు చెందిన మొత్తం 103 మంది విద్యార్థులు హాజరు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
మన గురించి, మన కుటుంబం కోసమే కాకుండా.. మన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచించినప్పుడే జీవితానికి నిజమైన అర్థం ఉంటుంది అని చెప్పారు వర్ల పాపయ్య చదువు, వృత్తి నైపుణ్యంలో భాగంగా.. అనేక అంశాలలో శిక్షణ తీసుకుంటారు.. అది మీ భవిష్యత్ కోసం. కాని యువ ఆపద మిత్రులుగా ఇప్పుడు తీసుకుంటున్న శిక్షణ పరుల కోసం.. అయినా మీరంతా ఎంతో సంతోషంగా ముందుకు రావడం చాలా మంచి పరిణామం అని అన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడమే కాకుండా, అవసరంలో ఉన్నవారికి చేయూతను ఇవ్వాలని పిలుపునిచ్చారు. విపత్తుల సమయంలో సహచరులను ఎలా రక్షించాలో, పరిసర పరిస్థితులను ఎలా గమనించాలో ఈ శిక్షణ నేర్పుతుందని తెలిపారు.
