హైదరాబాద్ : మన శంకర వర ప్రసాద్ తప్పకుండా హిట్ అవుతుందని అన్నారు నటుడు మెగాస్టార్ చిరంజీవి. తను కీలక పాత్ర పోషించిన ఈ మూవీకి సంబంధించి హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. మెగా ఫ్యాన్స్ అందరికీ తప్పకుండా నచచ్చుతుందన్నారు. అంతే కాదు అసలైన పండుగ రాబోతోందన్నారు. ఇంటిల్లిపాది హాయిగా చూస్తారని చెప్పారు. ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి కేవలం శంకర వరప్రసాద్ దే కాదు.. మొత్తం తెలుగు సినిమా పరిశ్రమది అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రభాస్ రాజాసాబ్, నా తమ్ముడు రవితేజ సినిమా, మా ఇంట్లో చిన్నప్పుడు నుంచి సరదాగా తిరుగుతూ పెరిగిన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నన్ను గురువుగా భావిస్తూ నా శిష్యుడుగా ఉన్న నవీన్ సినిమా..అన్ని సినిమాలు ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని కోరారు చిరంజీవి.
తెలుగు చిత్రం పరిశ్రమ సుభిక్షంగా ఉండాలని ఆశిస్తున్నానని అన్నారు.అలంటి విజయాలు ప్రేక్షకులు ఇచ్చి తీరుతారనే ప్రగాఢ నమ్మకం నాకు ఉన్నదని అన్నారు . 2026 సంక్రాంతి తెలుగు చిత్ర పరిశ్రమ మర్చి పోకూడదని అన్నారు. ప్రతి సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమా, నచ్చే సినిమా. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు ఆడేలా చేసే బాధ్యత మీది, అన్ని సినిమాల్ని థియేటర్స్ కి వెళ్లి చూడండి. థియేటర్స్ లోనే ఆస్వాదించండి, ఆశీర్వదించండి అని కోరారు మెగాస్టార్ చిరంజీవి.
