ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కామెంట్స్ పోలీస్ సంఘం సీరియ‌స్

బేష‌ర‌తుగా పోలీసుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్

hellotelugu-GopiReddyYedula

హైద‌రాబాద్ : మినీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్బంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల మీద చేసిన వ్యాఖ్యలను, వారి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం అధ్య‌క్షుడు గోపిరెడ్డి. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్న పోలీసుల పట్ల ఎమ్మెల్యే చేసిన అసభ్య వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయ‌ని మండిప‌డ్డారు. ఇది ఎమ్మెల్యేకు త‌గ‌ద‌న్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా గుంపులుగా వెళ్లడమే కాకుండా, బాధ్యత గల ప్రజా ప్రతినిధి అయి ఉండి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ వెళ్ళడానికి ప్రయత్నించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం దురదృష్టకరం అన్నారు. అక్కడ ఉత్పన్నమయ్యే శాంతి భద్రతల పరిస్థితి గురించి, కోర్టు ఉత్తర్వుల గురించి పోలీసు అధికారులు ఎమ్మెల్యే పూర్తిగా వివరించినప్పటికీ వారు అనుచితంగా ప్రవర్తించడమే కాక మహిళా పోలీసు అధికారులపట్ల కూడా దురుసుగా ప్రవర్తించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం గర్హనీయం.

పోలీసు అధికారుల మత ప్రస్తావన తేవడం అత్యంత గర్హనీయం. పైగా అక్కడ ప్రత్యక్షంగా లేని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ని ఉద్దేశించి, మత ప్రస్తావన చేస్తూ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి. బాధ్యత గల ప్రజా ప్రతినిధి అనేది మర్చిపోయి కేవలం పబ్లిసిటీ కోసం వివాదాలు సృష్టించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడాన్ని ప్రజాస్వామిక వాదులు అందరూ ఖండించాలని అన్నారు. ప్రజా ప్రతినిధులు తమ బాధ్యతల పట్ల మరింత గౌరవంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల పట్ల, శాంతి భద్రతల పట్ల నిబద్దతతో విధులు నిర్వర్తిసున్న తెలంగాణ పోలీసుల ఖ్యాతిని ఎవరూ విస్మరించ లేర‌ని అన్నారు గోపిరెడ్డి ఏదుల‌. అలాంటి వ్యవస్థ మీద మత పరమైన వ్యాఖ్యలు చేయడం అత్యంత గర్హనీయం. ఈ సంఘటనను పోలీసు వ్యవస్థ మనోబలాన్ని దెబ్బతీసే చర్యగా పరిగణిస్తాం. ఇలాంటి చర్యల పట్ల పోలీసు శాఖ తీవ్రంగా వ్యవహరిస్తుందని గుర్తుంచు కోవాలి.

Exit mobile version