ఉన్నత విద్య పునరుద్ధరణ జర్నల్ ఆవిష్క‌ర‌ణ

ఆవిష్క‌రించిన తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్

hellotelugu-TelanganaGovernor

హైద‌రాబాద్ : విశ్వ విద్యాలయాలు తమ విద్యా వ్యవస్థలను ఎలా పునరుద్ధరించు కోవాలి సాంకేతిక , ప్రపంచ మార్పులకు ఎలా స్పందించాలి, పరిశోధన, ఆవిష్కరణలను ఎలా బలోపేతం చేయాలి అనే అంశాలపై తెలంగాణ జర్నల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీజేహెచ్ఈ) తాజా సంచికను గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా విడుదల చేశారు. ఇరవై ఒకటవ శతాబ్దంలో విశ్వవిద్యాలయాలు: పునరుద్ధరణ, సంస్కరణలు , మార్గసూచికలు”అనే శీర్షికతో రూపొందించారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) ప్రచురించే ఒక అంతర్జాతీయ, పీర్-రివ్యూడ్ అర్ధవార్షిక జర్నల్. ఇది ఉన్నత విద్యలోని సమకాలీన సమస్యలు , అభివృద్ధి చెందుతున్న పరిణామాలపై దృష్టి పెడుతుంది. జర్నల్‌ను విడుదల చేసిన గ‌వ‌ర్న‌ర్ శుక్లా మాట్లాడుతూ టీజేహెచ్‌ఈ వంటి విద్యా వేదికలు పండితులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు , విధాన రూపకర్తలకు వర్ధమాన సవాళ్లపై చర్చించడానికి, జ్ఞానాన్ని పంచుకోవడానికి , ఉన్నత విద్యను ముందుకు తీసుకెళ్లడానికి వినూత్న విధానాలను అన్వేషించడానికి ఒక అవకాశాన్ని ఇస్తాయని అన్నారు.

ఈ జర్నల్ ద్వారా పరిశోధన, అకడమిక్ స్కాలర్‌షిప్ , విజ్ఞానవంతమైన చర్చను ప్రోత్సహిస్తున్నందుకు టీజీసీహెచ్‌ఈ ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి , అతని బృందాన్ని గవర్నర్ అభినందించారు. తెలంగాణలో పరిశోధన సంస్కృతిని , అకడమిక్ నైపుణ్యాన్ని బలోపేతం చేయడానికి కౌన్సిల్ తీసుకున్న చొరవలను కూడా ఆయన ప్రశంసించారు. టీజేహెచ్‌ఈ సాక్ష్యాధారిత పరిశోధన, విధాన సంభాషణ”కు దోహద పడుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో , వెలుపల ఉన్నత విద్య కోసం ఒక ముఖ్యమైన విద్యా వేదికగా ఆవిర్భవిస్తుందని శుక్లా ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశోధన సంస్కృతిని బలోపేతం చేయడానికి, అకడమిక్ నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి , ఉన్నత విద్యలో అర్థవంతమైన విధాన సంభాషణను సులభతరం చేయడానికి టీజీసీహెచ్‌ఈ నిబద్ధతను ఈ జర్నల్ ప్రతిబింబిస్తుందని రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీసీహెచ్‌ఈ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ కూడా పాల్గొన్నారు.

Exit mobile version