ఉత్కంఠ భ‌రితం ‘మ‌యూఖ’ చిత్రం

పాయ‌ల్ చెంగ‌ప్ప‌, ముర‌ళీధ‌ర్ గౌడ్

hellotelugu-Mayookha

హైద‌రాబాద్ : శ్రీ‌కాంత్ కాండ్రేగుల ద‌ర్శ‌క‌త్వం వహించిన చిత్రం మ‌యూఖ‌. పాయ‌ల్ చెంప్ప‌, ముర‌ళీధ‌ర్ గౌడ్, లావ‌ణ్య రాణి, చరిష్మ ద‌బ్బ‌ర‌, అమ‌న్ మ‌సూద్, త‌దిత‌రులు న‌టించారు. శ‌శిధ‌ర్ న‌ల్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే థియేటర్లలో విడుదల కాకముందే అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ప్ర‌శంస‌లు అందుకుంది. న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘బెస్ట్ మిస్టరీ మూవీ’ అవార్డును గెలుచు కోవడం ద్వారా ‘మయూఖ’ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక అరుదైన మానసిక అంశం ఆధారంగా రూపొందిన ఈ థ్రిల్లర్, స్థానిక ప్రేక్షకులకు ఉత్కంఠ భరితమైన అనుభూతిని అందించింది.

మయూఖ (పాయల్ చెంగప్ప) ఒక బ్యాంకులో పనిచేస్త అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తున్న పిరికి స్వభావం , ఆందోళన కలిగిన యువతి. ఎవరో అపరిచితుడు తరచుగా తన ఫ్లాట్‌లోకి చొర బడుతున్నాడని, తనను వెంబడిస్తున్నాడని ఆమెకు అనిపించడంతో త‌న‌ జీవితం భయానక మలుపు తిరుగుతుంది. ఆమె ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, తగిన ఆధారాలు లేక పోవడంతో వారు ఆమె భయాలను కొట్టిపారేస్తారు. అదే సమయంలో నగరంలో వరుస దారుణ హత్యలు జరుగుతుంటాయి. తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డ్ నుండి ఫ్లాట్ యజమాని వరకు అనుమానించడం మొదలు పెడుతుంది.

అనుమానంతో ఆమె సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, తనతో పనిచేసే ఒక పురుష సహోద్యోగి తన ఫ్లోర్‌కు రావడం గమనిస్తుంది. ఆ వెంటనే, అతను ఆమె ఇంటి తలుపు వద్దకు వస్తాడు. భయంతో కుంగిపోయిన ఆమె, అతన్ని లోపలికి రానిచ్చి, తలుపును బయటి నుండి గడియ పెట్టి, పోలీసులకు ఫోన్ చేస్తుంది. అయితే అధికారులు వచ్చేసరికి, గడియ పెట్టిన అపార్ట్‌మెంట్‌లో ఆమె సహోద్యోగి శవమై కనపడుతుంది, దీంతో మయూఖను అరెస్టు చేస్తారు. తరువాత జరిగిన దర్యాప్తులో ఆమె హత్య కేసు నుండి నిర్దోషిగా తేలడంతో, కొన్ని కీలకమైన ప్రశ్నలు తలెత్తుతాయి. గడియ పెట్టిన ఫ్లాట్‌లో హత్య చేసింది ఎవరు, ఎందుకు? మయూఖను వెంటాడుతున్న ఆ మాయా వేధింపుదారుడు ఎవరు..? అతను నిజంగా ఉన్నాడా లేక కేవలం ఆమె ఆందోళన వల్ల పుట్టిన ఊహా? పోలీసులు ఈ మానసిక చిక్కుముడిని ఎలా విప్పార‌నేది స‌స్పెన్స్‌.

Exit mobile version