హైదరాబాద్ : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తన భర్త , యంగ్ యాక్టర్ విజయ్ దేవరకొండ గురించి. చాలా గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ కలిసి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన రణబలి మూవీలో కలిసి నటించారు. గతంలో పరుశురామ్ దర్శకత్వం వహించిన గీత గోవిందం మూవీలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ప్రేమలో పడి పోయారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు వాళ్లు డేటింగ్ చేశారు. ఆ తర్వాత తమ ప్రేమను ప్రకటించారు. పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత రాహుల్ దర్శకత్వం వహించిన పీరియాడిక్ మూవీ రణబలిలో నటించారు. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రిటీష్ కాలంలో చోటు చేసుకున్న కరువు కారణంగా బలై పోయిన బాధితుల ఆక్రందనను సినిమాపై ఆవిష్కరించేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.
తాజాగా ట్రైలర్ సందర్భంగా రష్మిక మందన్నా మాట్లాడారు. తన మనసులో భావాలను పంచుకున్నారు.
తను చాలా అంకితభావం కలిగిన నటుడు అని ప్రశంసించారు. విజయ్ దేవరకొండతో కలిసి పని చేయడం చాలా సరదాగా” ఉందని రష్మిక మందన్న అన్నారు . సినిమా సెట్‌లో తన నుండి తాను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నానని వెల్లడించారు. సోషల్ మీడియాలో అభిమానులతో జరిగిన ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఒక అభిమాని ప్రశ్నకు సమాధానంగా రష్మిక ‘రణబలి’ సెట్స్‌లో తాను చాలా సరదాగా గడిపానని పంచుకున్నారు. ఎప్పుడూ చాలా సరదాగా ఉంటుంది, కానీ సీరియస్‌గా చెప్పాలంటే మీ అందరికీ తెలిసినట్లుగా సెట్ విషయంలో ఆయన చాలా అంకితభావంతో, సీరియస్‌గా ఉంటారు అని నిజం చెప్పేసింది రష్మిక మందన్నా.
