ఆశా భోస్లేను కోల్పోవ‌డం తీర‌ని న‌ష్టం

ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలన్న మోదీ

Heellotelugu-PMModi

న్యూఢిల్లీ : బాలీవుడ్ కు చెందిన సినీ దిగ్గ‌జ గాయ‌ని ఆశా బోస్లే ఆదివారం క‌న్నుమూశారు. ఆమె ప‌లు భాష‌ల‌లో వేలాది పాట‌లు పాడారు. త‌ను స్వ‌యంగా మ‌రో దిగ్గ‌జ దివంగ‌త గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ సోద‌రి. త‌న వ‌య‌సు 92 ఏళ్లు. ఆశా మ‌ర‌ణంతో భార‌త దేశం గొప్ప వ్య‌క్తిని, అంత‌కు మించిన క‌ళాకారిణిని కోల్పోయింద‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. విష‌యం తెలిసిన వెంట‌నే ఆయ‌న క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. ఈసంద‌ర్బంగా త‌న‌తో క‌లిసిన జ్ఞాప‌కాల‌ను ఎక్స్ వేదిక‌గా పంచుకున్నారు ఆదివారం.

భారతదేశం ఇప్పటి వరకు చూసిన అత్యంత ప్రసిద్ధ, బహుముఖ ప్రజ్ఞాశాలి గాయకులలో ఒకరైన ఆశా భోస్లే గారి మరణ వార్త విని తీవ్రంగా దుఃఖిస్తున్నానని పేర్కొన్నారు. దశాబ్దాల పాటు సాగిన ఆమె అసాధారణ సంగీత ప్రస్థానం మన సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లెక్కలేనన్ని హృదయాలను తాకిందన్నారు. ఆమె హృద్యమైన రాగాలైనా, ఉత్సాహ భరితమైన స్వరకల్పనలైనా, ఆమె స్వరంలో కాలాతీతమైన ప్రకాశం నిండి ఉండేదని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆమెతో నాకు కలిగిన అనుభవాలను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపారు మోదీ.

ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు పీఎం. ఆమె తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటారని, ఆమె పాటలు ప్రజల జీవితాలలో శాశ్వతంగా ప్రతిధ్వనిస్తాయని అన్నారు మోదీ.

Exit mobile version