టి20 వ‌రల్డ్ క‌ప్ కోసం రేపే భార‌త‌ జ‌ట్టు ఎంపిక‌

కీల‌క‌మైన మార్పులు ఏవీ ఉండ‌వు

hellotelugu-GambhirAgarkar

ముంబై : వ‌చ్చే ఏడాది 2026లో ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఆయా జ‌ట్లు త‌మ పూర్తి స్థాయి ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసే ప‌నిలో ప‌డ్డాయి. తాజాగా బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ ఈనెల 20న శ‌నివారం అధికారికంగా భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించ‌నుంది. ఇప్ప‌టికే తీవ్ర విమ‌ర్శలు ఎదుర్కొంటున్నారు ప్ర‌స్తుత టి20 జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్, వైస్ కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ లు. ఈ ఇద్ద‌రూ జ‌ట్టుకు భారంగా మారారు. ఒక‌రు 31 ఇన్నింగ్స్ లు ఆడి 291 ర‌న్స్ చేస్తే మ‌రొక‌రు అత్యంత పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో తీవ్ర నిరాశ‌కు గురి చేస్తున్నారు. కెప్టెన్, వైస్ కెప్టెన్ల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని పెద్ద ఎత్తున మాజీ క్రికెట‌ర్లు, ఫ్యాన్స్ మండి ప‌డుతున్నారు. కానీ జ‌ట్టు హెడ్ కోచ్ గంభీర్, సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అగార్క‌ర్ లు ఈ ఇద్ద‌రికి వంత పాడుతూ వ‌స్తున్నారు. మ‌రో వైపు టాలెంట్ క‌లిగిన ప్లేయ‌ర్ల‌ను బెంచ్ కే ప‌రిమితం చేస్తుండ‌డం ప‌ట్ల తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా స‌మాచారం ప్ర‌కారం రేపు ఎంపిక చేసే తుది జ‌ట్టులో ఎలాంటి మార్పులు ఉండ‌క పోవ‌చ్చ‌ని స‌మాచారం. ఎందుకంటే గంభీర్, అగార్కర్ లు త‌మ‌కు ఇష్టం ఉన్న ఆట‌గాళ్ల‌నే ఎంపిక చేస్తార‌ని డిసైడ్ అయ్యారు క్రికెట్ ఫ్యాన్స్. వాళ్లు జ‌ట్టు ప్ర‌యోజ‌నాల కంటే త‌మ‌కు న‌చ్చిన వారినే అంద‌లం ఎక్కిస్తార‌ని, అందుకే సంజూ శాంస‌న్, జైశ్వాల్, రింకూ సింగ్ లు అద్భుతంగా ఆడుతున్నా ప‌క్క‌న పెట్టార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొత్తంగా ఫైన‌ల్ గా జ‌ట్టును ప్ర‌క‌టించినా కెప్టెన్, వైస్ కెప్టెన్ లుగా సూర్య కుమార్ యాద‌వ్, గిల్ ల‌కు త‌ప్ప‌కుండా చోటు ఉంటుంద‌ని అంటున్నారు. ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే 15 మంది ఆట‌గాళ్ల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ , అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కులదీప్ , శాంస‌న్ , యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్, నితీష్‌ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణల‌ను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.

Exit mobile version