Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

అన్నపూర్ణ నిలయం తిరుమ‌ల పుణ్య క్షేత్రం

ప్ర‌తి రోజు 3 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదం

October 8, 2026
in Community, Spiritual
0 0
A A
hellotelugu-TTDAnnaprasadam
Share on FacebookShare on Twitter

తిరుమల : “వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి” అన్న దైవ స్తోత్రానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచే తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు శ్రీవారి కృపతో పాటు టీటీడీ నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద సేవ అక్షయ పాత్రలా కొనసాగుతోంది. తిరుమలలో ఆకలితో ఉన్న భక్తుడికి అన్నం అందించడమే లక్ష్యంగా టీటీడీ అన్నప్రసాదం విభాగం 24 గంటలూ నిరంతరం పని చేస్తోంది. సాధారణ రోజుల్లో సుమారు 1.80 లక్షల నుంచి 1.90 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తుండగా, రద్దీ రోజులు, వారాంతాల్లో ఈ సంఖ్య 3 లక్షలకు మించుతోంది. పానీయాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కలిపి రోజుకు దాదాపు 3 లక్షల సర్వింగ్స్ భక్తులకు అందుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , దివంగ‌త‌ నందమూరి తారక రామారావు సంకల్పంతో 1985 ఏప్రిల్ 6న తిరుమలలో శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నదాన పథకం ప్రారంభమైంది. అనంతరం 1994 ఏప్రిల్ 1న ఈ పథకాన్ని ట్రస్టుగా మార్చారు. ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సేవలు మరింత విస్తృతంగా కొనసాగుతున్నాయి. తిరుమలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను విస్తరిస్తున్నారు.

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, శ్రీ అక్షయ వంటశాల, వకుళమాత వంటశాలలు 24 గంటలూ పనిచేస్తూ భక్తులకు ఆహారాన్ని అందిస్తున్నాయి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో రోజుకు 80 వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం అందుతోంది. ఇక్కడ ఉదయం ఉప్మా, పొంగలి, చట్నీ, సాంబార్ వంటి అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి అన్నం, కూర, చట్నీ, వడ, సాంబార్, రసం, మజ్జిగ, స్వీట్ పొంగల్ తదితర పదార్థాలను భక్తులకు వడ్డిస్తున్నారు.

Related Post

hellotelugu-TTDBooking

టీటీడీ ద‌ర్శ‌నం టికెట్ల బుకింగ్ లో గంద‌ర‌గోళం ..?

October 7, 2026
hellotelugu-MPLingameniRamesh

మోదీ పేరుపై ఇంద్రకీలాద్రిలో ఖడ్గమాల అర్చన

October 7, 2026
hellotelugu-SriRamanujaccharay

శ్రీ‌వారి కైంకర్య వ్యవస్థకు పునాది తో మహోన్నత సేవ

October 2, 2026
hellotelugu-KalkiBhagvan

‘క‌ల్కి భ‌గ‌వ‌న్’ విజ‌య్ కుమార్ నాయుడు క‌న్నుమూత

September 30, 2026

శ్రీ అక్షయ వంటశాలలో గోధుమ రవ్వ ఉప్మా, సుజీ రవ్వ ఉప్మా, పొంగలి, సాంబారన్నం, పెరుగన్నం, టమోటా రైస్, సుండలు, పాలు, టీ, కాఫీ తదితరాలను తయారు చేస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే పర్వదినాల్లో మజ్జిగ, బాదం పాలు, బిస్కెట్లు, జ్యూస్ ప్యాకెట్లను కూడా పంపిణీ చేస్తున్నారు. వకుళమాత వంటశాల ద్వారా యాత్రికుల వసతి సముదాయాలు, కేంద్రీయ విచారణ కార్యాలయం, రామ్‌భగీచా అతిథి గృహం, అంజనాద్రి నిలయం తదితర ప్రాంతాల్లోని భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులతో పాటు నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్ల వెలుపల ఏర్పాటు చేసిన కేంద్రాలు, PAC అన్నప్రసాద భవనాలు, వివిధ వసతి సముదాయాల్లోని భోజనశాలల ద్వారా భక్తులకు ఆహారం, పానీయాలు అందిస్తున్నారు. భక్తులు దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న సమయంలో కూడా ఆకలితో ఇబ్బంది పడకుండా చూడటమే టీటీడీ అన్నప్రసాద విభాగం ప్రధాన లక్ష్యంగా పని చేస్తోంది.లక్షలాది మంది భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ ప్రతిరోజూ భారీ స్థాయిలో ముడి పదార్థాలను వినియోగిస్తోంది.

రోజుకు సుమారు 15,788 కిలోల బియ్యం, 3,110 కిలోల సన్‌ఫ్లవర్ ఆయిల్, 2,861 కిలోల కందిపప్పు, 2,832 కిలోల సుజీ రవ్వ, 2,825 కిలోల గోధుమ రవ్వ, 1,729 కిలోల మినప్పప్పు, 1,436 కిలోల ఉప్పు, 1,276 కిలోల బెల్లం, 497 కిలోల చింతపండు వినియోగిస్తున్నారు. అదేవిధంగా రోజుకు సుమారు 4,375 కొబ్బరికాయలు, 430 కిలోల చక్కెర, 309 కిలోల ఎండు మిర్చి, 209 కిలోల ధనియాలు తదితర ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నారు.2026 జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30వ తేది వరకు తిరుమలలోని వివిధ అన్నప్రసాద కేంద్రాల ద్వారా 9 కోట్లకు పైగా సర్వింగ్స్ భక్తులకు అందించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు తాజాగా నాణ్యమైన, రుచికరమైన అన్న ప్రసాదాలు తయారు చేస్తూ భక్తులకు పంపిణీ చేయడం జరుగుతోంది.

భక్తులకు అందించే అన్నప్రసాదం నాణ్యతను పెంచడంతో పాటు సేవలను మరింత విస్తరించేందుకు టీటీడీ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది.చట్నీలు, కూరల తయారీలో తాజా కొబ్బరికాయల వినియోగాన్ని ప్రవేశపెట్టింది. 2024లో వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించి అదనంగా 28 ప్రాంతాలకు ఆహార పంపిణీ సేవలను విస్తరించింది. ఏడాది ముందు ప్రారంభించిన PAC-5 (వెంకటాద్రి నిలయం)లో ఒకేసారి సుమారు 1,500 మంది భోజనం చేసే సామర్థ్యంతో డైనింగ్ హాళ్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 2 లక్షల మంది భక్తులకు ఆహారం తయారు చేయగల సామర్థ్యంతో కొత్త శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి.

MTVAC కిచెన్‌లో ఆధునిక వంట పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు, భక్తులు సులభంగా విరాళాలు అందించేందుకు QR కోడ్ ఆధారిత విరాళాల సేకరణ కియోస్క్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల విరాళాలతో నిర్వహించబడుతున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ వద్ద ప్రస్తుతం రూ.2900 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ నిధులపై వచ్చే ఆదాయంతో లక్షలాది మంది భక్తులకు నిత్యం ఉచితంగా నాణ్యమైన అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు.

Related Posts

hellotelugu-TTDBooking
Community

టీటీడీ ద‌ర్శ‌నం టికెట్ల బుకింగ్ లో గంద‌ర‌గోళం ..?

October 7, 2026
hellotelugu-MPLingameniRamesh
Community

మోదీ పేరుపై ఇంద్రకీలాద్రిలో ఖడ్గమాల అర్చన

October 7, 2026
hellotelugu-SriRamanujaccharay
Community

శ్రీ‌వారి కైంకర్య వ్యవస్థకు పునాది తో మహోన్నత సేవ

October 2, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
hellotelugu-OU

ఓయూ-ఏఐజి పరిశోధనకు పుర‌స్కారం

October 8, 2026
hellotelugu-APGovt

ఇళ్ల స్థ‌లాల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ప్ర‌త్యేక క‌మిటీ

October 8, 2026
hellotelugu-Canada

భార‌త దేశంతో భాగ‌స్వామిగా ఉండేందుకు సిద్దం

October 8, 2026
hellotelugu-TTDAnnaprasadam

అన్నపూర్ణ నిలయం తిరుమ‌ల పుణ్య క్షేత్రం

October 8, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • casino
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Game
  • Games
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

andh Andhra Pradesh Avika Gor Bharat busbus business Business News casino game online casino oinline game casino onlina game casino online game casino online game online casino online game pinco casino online game pin up casino onlne game casino pinco online game casino pin up online game CM Chandrababu Cricket Cricketer Devotional News freshbet casino review gamblezen casino uk Global Hollywood Jr NTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas reveryplay promo code no deposit Rishab Shetty Spiritual News Sports News Spotlight News telan Telangana Telangana News tokky Tollywood Traditional News Vijay Sethupathi World

Recent Post

  • ఓయూ-ఏఐజి పరిశోధనకు పుర‌స్కారం
  • ఇళ్ల స్థ‌లాల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ప్ర‌త్యేక క‌మిటీ
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version