న్యూఢిల్లీ : తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ భారతీయ న్యాయవాది ముకుల్ రోహత్గి. ఆయన మీడియాతో మాట్లాడారు. 108 సీట్లతో భారీ మెజారిటీని సాధించిన టీవీకే విజయ్ పట్ల గవర్నర్ అనుసరిస్తున్న తీరు దారుణమన్నారు. ప్రజలు TVKకి స్పష్టమైన తీర్పు (mandate) ఇచ్చారని చెప్పారు. అంతిమ నిర్ణేతలు ప్రజలేనని ఆ విషయం కేంద్రంలోని మోదీ, షా, గవర్నర్ రాజేంద్రన్ తెలుసుకుంటే మంచిదన్నారు. ఇప్పుడు గవర్నర్, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం కల్పించాలన్నారు.
ఎమ్మెల్యేల మద్దతు ఉందో లేదో తేల్చే ‘అగ్నిపరీక్ష’ గవర్నర్ వద్ద కాకుండా, అసెంబ్లీలోనే జరగాలన్నారు ముకుల్ రోహత్గి. . గతంలో తాను స్వయంగా వాదించిన కేసులలో, సుప్రీం కోర్టు ఇదే అంశంపై స్పష్టమైన తీర్పులను వెలువరించిందని చెప్పారు. జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన కేసులోనూ, 2020లో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్ కేసులోనూ, అలాగే 2018లో బీజేపీకి చెందిన యడియూరప్ప కేసులోనూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు అత్యంత స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు న్యాయవాది.
అత్యధిక స్థానాలను గెలుచుకున్న పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలి; అంతేకాకుండా, అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించు కోవడానికి ఆ పార్టీకి తగినంత సమయం కూడా కేటాయించాల్సిన వసరం ఉందన్నారు. గవర్నర్ కేవలం రబ్బర్ స్టాంపు మాత్రమేనని పేర్కొన్నారు.

















