అమరావతి : రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త (OFOE) కార్యక్రమానికి నూతనంగా శ్రీకారం చుట్టామని చెప్పారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్త (మెప్మా) తో పలు సంస్థలు మంత్రి సమక్షంలో ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్బంగా మంత్రి నారాయణ మాట్లాడారు. మెప్్మా ద్వారా ప్రతి పేద పట్టణ కుటుంబానికి కనీసం ఒక సుస్థిర జీవనోపాధి వ్యాపారాన్ని అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని కార్య రూపంలోకి తీసుకు వస్తున్నామని తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా కుటుంబాల ఆర్థికాభివృద్ధితో పాటు పట్టణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ ఈ ఫ్రాంచైజీలు అన్ని ఒక పద్దతి ప్రకారం డెవలప్ చేసి మహిళల బిజినెస్ మంచి సక్సెస్ అయ్యేలాగా సపోర్ట్ చేయాలని కోరారు. ఈ MoU పార్టనర్లు అందరూ. ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త ( OFOE ) లో భాగంగా ముఖ్యమంత్రి ఏదైతే సూచనలు ఇచ్చారు దానిలో భాగంగా ఈ ఫ్రాంచైజీ వాళ్ళందరూ స్వయం సహాయక సంఘాల అందరూ అభివృద్ధికి పాటు పడవలసిందిగా సూచనలు చేశారు. అలాగే ప్రతి ఒకరి స్వయం సహాయక సంఘాలను మంచి వ్యాపారవేత్తలుగా తయారు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, డైరెక్టర్, పి. సంపత్ కుమార్, వాకాటి కరుణ, తదితరులు పాల్గొన్నారు.
















