పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ముఖ్య పాత్ర పోషిస్తున్న చిత్రం స్పిరిట్. దీనికి దర్శకత్వం వహిస్తున్నారు దమ్మున్న దర్శకుడు వంగా సందీప్ రెడ్డి. ఇప్పటికే తను చిత్రానికి సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చాడు. ఇదే మూవీకి అద్భుతమైన టైటిల్ ఫిక్స్ చేశాడు. దాని పేరు స్పిరిట్. సినిమాలో బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనేను తీసుకోవాలని అనుకున్నాడు. ఆ తర్వాత తనను తప్పించాడు డైరెక్టర్. ఈ నిర్ణయం పెద్ద రాద్దాంతానికి దారితీసింది. తన నుంచి ఎక్కువ డేట్స్ కావాలని దర్శకుడు కోరాడని, అందుకే తాను ఒప్పుకోలేదని ప్రకటించింది దీపికా పదుకొనే. తాజాగా స్పిరిట్ సినిమా పోస్టర్ ను కొత్త సంవత్సరం సందర్బంగా రిలీజ్ చేశాడు మూవీ మేకర్ వంగా సందీప్ రెడ్డి. ఫస్ట్ లుక్ దుమ్ము రేపుతోంది.
సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది ఈ లుక్. అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్ తో పాటు సినీ విమర్శకులు, విశ్లేషకులు. అభిమానులు, సినీ వర్గాలలో విస్తృత చర్చకు, ఉత్సాహానికి దారితీసింది. దాని ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల కావడంతో ఆ హైప్ మరింత పెరిగింది. ఇంకా సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా చేశాయి. కొంతమంది పరిశీలకులు ఫస్ట్ లుక్ శక్తివంతంగా ఉన్నప్పటికీ, అది పూర్తిగా ఆశ్చర్యం కలిగించలేదని భావిస్తున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి వంటి కొద్దిమంది మినహా, చాలా మంది చిత్రనిర్మాతల మాదిరిగానే, సందీప్ రెడ్డి విజువల్ శైలి మొదటి చూపులోనే ఆకట్టుకుంది. ప్రస్తుతం స్పిరిట్ ఫస్ట్ లుక్ దుమ్ము రేపుతోంది. టాప్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
