హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎస్ఎస్ రాజమౌళి ప్రిన్స్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో కలిసి తీస్తున్న వారణాసి కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ మరింత క్యూరియాసిటీ పెంచేలా చేస్తున్నారు. ఇప్పటికే భారత దేశానికి సంబందించి ఏ దర్శకుడు చేయని సాహసం చేస్తున్నారు జక్కన్న. కేవలం ప్రచారానికే అత్యధికంగా సమయం, ఖర్చు చేస్తున్నట్లు టాక్. వారణాసిని హాలీవుడ్ ను తలదన్నేలా చిత్రీకరించే పనిలో పడ్డారు దర్శకుడు. తాజాగా ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశాన్ని ముందుకు తీసుకు వచ్చారు జక్కన్న. అదేమిటంటే వారణాసి చిత్రం పూర్తిగా భావోద్వేగాలతో కూడుకుని ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ఈ చిత్రం ప్రస్తుతం 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
అయితే ఇప్పటికే ఉన్న భారీ అంచనాలకు మరో కొత్త కోణాన్ని జోడించాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ రాజమౌళి ‘వారణాసి’ చిత్రంలోని ప్రధాన అంశాన్ని వెల్లడించారు; దీనిని బలమైన భావోద్వేగ పునాదితో కూడిన అద్భుత దృశ్య కావ్యంగా ఆయన అభివర్ణించారు. వారణాసి అనేది భావోద్వేగం ప్రధానాంశంగా సాగే ఒక భారీ దృశ్య కావ్యం అని రాజమౌళి పేర్కొన్నారు. ఈ చిత్రంలోని భావోద్వేగ ప్రధానాంశం తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధం చుట్టూ తిరుగుతుంది. ‘వారణాసి’ చిత్రం పురాణ గాథలు, కాల ప్రయాణం , యాక్షన్ , అద్భుతమైన దృశ్యాలను అందిస్తున్నప్పటికీ, తండ్రీకొడుకుల సంబంధమే కథను నడిపిస్తూ, దానికి భావోద్వేగ లోతును ఇస్తుందని భావిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు ‘రుద్ర’ పాత్రను పోషిస్తుండగా, ప్రకాష్ రాజ్ అతని తండ్రిగా నటిస్తున్నట్లు సమాచారం.
