ఆక‌ట్టుకున్న బిగ్ బాస్ 10 పోటీదారులు

గ్రాండ్ గా లాంచ్ అయిన రియాల్టీ షో

hellotelugu-BigBosss10

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్ బాస్ 10 రియాల్టీ షో ఒకేసారి నాలుగు భాష‌ల‌లో ఒకే స‌మ‌యంలో ప్రారంభ‌మైంది. ఇది స్టార్ మాతో పాటు జియో హాట్ స్టార్ లో ప్ర‌సారం అవుతోంది. ఇక బిగ్ బాస్ 10లో పార్టిసిపేట్ చేస్తున్న పోటీదారులు అత్య‌ధికంగా పారితోష‌కం అందుకోనున్నారు. సాధారణంగా పోటీదారులు ఎలిమినేట్ అయిన లేదా షో పూర్తయిన నెల రోజుల్లోపు తమ పారితోషికంలో సుమారు 80 శాతాన్ని అందుకుంటారు. బిగ్ బాస్ సీజన్ 10 పోటీదారులు హౌస్‌లో ఉన్న సమయంలో మంచి వారపు పారితోషికాన్ని పొందుతున్నారు. ప్రజాదరణ , మార్కెట్ విలువ ఆధారంగా ప్రముఖులకు అధిక పారితోషికం లభిస్తుందని సమాచారం. యాంకర్ వర్షిణి, నటుడు కృష్ణుడు , త్రిగుణ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. వీరు ఒక్కొక్కరు వారానికి రూ. 3 లక్షలు సంపాదిస్తున్నారు. జబర్దస్త్ నరేష్ , చైత్ర రాయ్ వారానికి రూ. 2.25 లక్షలు అందుకుంటున్నారు.

అలాగే టెంపర్ వంశీ , యాంకర్ సుధీర్ రెడ్డి వారానికి రూ. 2 లక్షలు పొందుతున్నారు. మాజీ పోటీదారులు తమ ఖచ్చితమైన ఆదాయాన్ని బయట పెట్టడం అరుదు, అయినప్పటికీ చాలా మంది తమకు అందిన మొత్తం తాము మొదట ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని అంగీకరిస్తారు. వారానికి కనీసం రూ. 2 లక్షలు తీసుకునే పోటీదారు 15 వారాల సీజన్‌లో సుమారు రూ. 30 లక్షలు సంపాదించవచ్చు. అయితే, చెల్లింపుల ప్రక్రియ కచ్చితమైన నిబంధనలతో కూడి ఉంటుంది. షో ముగిసిన వెంటనే పోటీదారులకు మొత్తం డబ్బు ఒకేసారి అందదు. వారపు పారితోషికం నుండి జీఎస్‌టీ వంటివి మినహాయించ బడతాయి చెల్లింపులు నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. సాధారణంగా పోటీదారులు ఎలిమినేట్ అయిన లేదా షో పూర్తయిన నెల రోజుల్లోపు తమ పారితోషికంలో సుమారు 80 శాతాన్ని అందుకుంటారు. ఒప్పందంలోని అన్ని షరతులు నెరవేరే వరకు మిగిలిన 20 శాతం మొత్తాన్ని నిర్మాణ బృందం తమ వద్దే ఉంచుకుంటుంది.

Exit mobile version