హైదరాబాద్ : ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణం – పార్ట్ 1 నవంబర్ 5 గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆశించిన దానికంటే అద్భుతంగా తెరపై కనిపించేలా చేశాడు దర్శకుడు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, యశ్ , సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు. రాముడిగా రణ్ బీర్ నటిస్తే సీత పాత్రలో ఒదిగి పోయింది సాయి పల్లవి. ఇక టాక్సి క్ తో నిరాశ పరిచిన యశ్ ఉన్నట్టుండి రావణుడి పాత్రలో మెప్పించాడు. తను ఆ పాత్రను ఒప్పుకోవడమే ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పోయేలా చేసింది. ఇక భారీ బడ్జెట్, ప్రముఖ తారాగణంతో రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
రామాయణ కథ అందరికీ తెలిసిందే. మొదటి భాగం రావణుడు బ్రహ్మ దేవుని నుంచి వరం పొందడానికి కఠిన తపస్సు చేయడంతో మొదలవుతుంది. ఆ తర్వాత అతను లంకాధిపతిగా ఎలా ఎదిగాడో చూపిస్తూ, శ్రీరాముని జనన ఘట్టానికి దారితీస్తుంది. రాముని బాల్యం, సీతతో వివాహం, వనవాసం , రావణుడు సీతను అపహరించడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. రాముడు , రావణుడి మధ్య జరిగే యుద్ధం రెండో భాగంలో ఉంటుంది. తాజాగా తివారీ రూపొందించిన రామాయణం చిత్రానికి అతిపెద్ద బలం దీని దృశ్యాలతో పాటు అద్భుతమైన ప్రెజెంటేషన్. అందరికీ తెలిసిన ఈ ఇతిహాసాన్ని అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ , భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కించారు.
. జటాయువు-రావణుల మధ్య పోరాటం, సీతాపహరణం, రాముడు రాక్షసులతో చేసే యుద్ధాలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణలు. శ్రీరాముని ప్రవేశం కూడా చాలా చక్కగా రూపొందించాడు. సినిమాలో శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించారు. వీరితో పాటు సన్నీ డియోల్, కాజల్, శోభన, రవి దూబే, లారా దత్తా కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు. ఆశించినంతగా రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ మ్యాజిక్ చేయలేక పోయింది. అంతే కాదు సినిమా నిడివి 3 గంటల పాటు ఉండడం కూడా ఓ మైనస్. అయినా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా రామాయణం.



















