PM Modi Emergency Book : ఎమ‌ర్జెన్సీ స‌మ‌యం మోదీ ప్ర‌యాణం

ఐ వాజ్ యంగ్ ఆర్ఎస్ఎస్ ప్ర‌చారక్

Hello Telugu - PM Modi Emergency Book

Hello Telugu - PM Modi Emergency Book

PM Modi : ఢిల్లీ – ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్వ‌యంగా ఆనాటి ఇందిర విధించిన ఎమ‌ర్జెన్సీ గురించి త‌న అనుభ‌వాల‌ను పుస్త‌క రూపంలో తీసుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్బంగా త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టారు. ఆనాటి సంఘ‌ట‌నల‌ను గుర్తు చేసుకున్నారు. ది ఎమ‌ర్జెన్సీ డైరీస్ అని పేరు పెట్టారు. ఐ వాజ్ యంంగ్ ఆర్ఎస్ఎస్ ప్ర‌చారక్ అంటూ ప్రారంభించారు. ఈ దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా పుస్త‌కాన్ని తీసుకు వ‌చ్చిన‌ట్లు తెలిపారు . ప్ర‌స్తుతం ఇది సంచ‌ల‌నంగా మారింది.

PM Modi Emergency Tour

ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎమ‌ర్జెన్సీకి వ్య‌తిరేకంగా ధృడంగా నిలిచిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ దేశం సెల్యూట్ చేస్తుంద‌ని అన్నారు. త‌న అనుభ‌వాన్ని, నాయ‌కుడిగా తాను ఎలా మారాన‌నే దానిపై ఇందులో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు మోదీ (PM Modi). ది ఎమ‌ర్జెన్సీ డైరీస్ పుస్త‌కాన్ని బ్లూ క్రాఫ్ట్ డిజిట‌ల్ ఫౌండేష‌న్ స‌మ‌ర్పించింది.

ది ఎమర్జెన్సీ డైరీస్’ ఎమర్జెన్సీ కాలంలో నా ప్రయాణాన్ని వివరిస్తుంది. అది ఆ కాలం నుండి అనేక జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది. ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను గుర్తు చేసుకున్న వారందరూ లేదా ఆ సమయంలో బాధపడ్డ కుటుంబాలు ఉన్నవారు సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకోవాలని నేను కోరుతున్నానని తెలిపారు. ఇది 1975 నుండి 1977 వరకు అవమానకరమైన కాలంలో యువతలో అవగాహనను సృష్టిస్తుందని అభిప్రాయ‌ప‌డ్డారు. విచిత్రం ఏమిటంటే ఈ పుస్త‌కానికి ముందు మాటను మాజీ ప్ర‌ధాన‌మంత్రి హెచ్ డి దేవగౌడ రాయ‌డం విశేషం.

మన రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించిన తీరు, పార్లమెంటు గొంతు నొక్కడం, కోర్టులను నియంత్రించడానికి ప్రయత్నించిన తీరును ఏ భారతీయుడు కూడా ఎప్పటికీ మర్చిపోడు. 42వ సవరణ వారి మోసాలకు ప్రధాన ఉదాహరణ. ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకున్నారు, వారి గౌరవాన్ని అవమానించారని పేర్కొన్నారు. మొత్తంగా ఈ వేళ మోదీ పుస్త‌కం దేశంలో మ‌రో చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది.

Also Read : Puri Jagannath Darshan Interesting : భాగ్యనగరం లోనే పూరీ జగన్నాథుని దర్శనం

Exit mobile version