ప్ర‌జ‌ల భ‌ద్ర‌తే కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యం

స్ప‌ష్టం చేసిన ప్ర‌భుత్వ విప్ పంచుమ‌ర్తి అనురాధ

hellotelugu-PanchumarthiAnuradha

అమ‌రావ‌తి : ప్ర‌జ‌ల భ‌ద్ర‌తే త‌మ కూట‌మి స‌ర్కార్ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌భుత్వ విప్ పంచుమ‌ర్తి అనురాధ‌. టీడీపీ మ‌హానాడు లో భాగంగా రెండో రోజు శాంతి భ‌ద్ర‌త‌ల‌పై తీర్మానం చేశారు. ఈ సంద‌ర్బంగా ఆమె ప్ర‌సంగించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సామాజిక స్థిరత్వానికి పటిష్టమైన శాంతి భద్రతలే పునాది అని విశ్వసించే పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు. గత ఐదేళ్లు అరాచక, గొడ్డలి పాలన కొనసాగితే ఇప్పుడు ప్రజల భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఒకవైపు గత ఐదేళ్లు జరిగిన కిరాతక, అరాచక , గొడ్డలి పాలన , మరొవైపు ప్రజల భద్రతను శ్వాసగా వినిపిస్తున్న కూటమి పాలన క‌నిపిస్తోంద‌న్నారు. 2019 లో సానుభూతి ఓట్ల కోసం సొంత బాబాయిని గొడ్డలి వేటు వేసి, గుండెపోటు అని కథలల్లాడంటూ జ‌గ‌న్ ను ఉద్దేశించి ఆరోపించారు.

వైసీపీ పాలనలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై దాడులు, హత్యలు పెరిగాయన్నారు. ఇక మహిళలపై ఆత్యాచారాలకు అంతు లేనే లేద‌న్నారు.. తన సొంత నయోజకవర్గం పులివెందలలో నాగమ్మ ఆత్యాచారానికి గురై, హత్యచేస్తే కనీసం పట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు. అమరావతి మహిళా రైతులపై అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించిన ఘ‌న‌త జ‌గ‌న్ రెడ్డిదేన‌ని మండిప‌డ్డారు పంచుమ‌ర్తి అనురాధ‌. మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్‌ను వేధించి మానసికంగా హింసించారు .దళిత యువకుడు సుబ్రమణ్యాన్ని హత్య చేసి కారు డిక్కీలో తరలించిన ఘటన రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసిందన్నారు. ఇసుక మాఫియాను ప్రశ్నించిన దళిత యువకుడు వరప్రసాద్‌పై దాడులు జరిగాయి
అక్కను వేధించ వద్దన్నందుకు అమరనాథ్ గౌడ్‌ను సజీవ దహనం చేసిన ఘటనలు వైసీపీ అరాచకానికి నిదర్శనం అన్నారు.

Exit mobile version