హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తనను వెనుకేసుకు వస్తున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీరును తప్పు పట్టింది. ఇదే సమయంలో హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ లోతుకుంట భూముల వ్యవహారంపై తన తీరు దారుణంగా ఉందంటూ వ్యాఖ్యానించింది. ఈ సందరర్బంగా సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది తాజా తీర్పులో. ప్రధానంగా పనితీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. అలాగే కమిషనర్‌ను తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. సంబంధిత అంశంపై విచారణ సందర్భంగా ఆ సంస్థ పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
విచారణ సందర్బంగా తక్షణమే ఏవీ రంగనాథ్ ను తొలగించాలని లేక పోతే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఐజీ స్థాయి అధికారిని రంగనాథ్ స్థానంలో నియమించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను వెంటనే తప్పించాలని పేర్కొన్నారు జస్టిస్ అనిల్ కుమార్ ఆదేశించారు. కోర్టు ధిక్కారానికి సంబంధించిన వ్యవహారంలో సదరు అధికారి సమర్పించిన క్షమాపణపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఒక సీనియర్ అధికారిపై ఏకంగా 63 కోర్టు ధిక్కార కేసులు ఉండటం సముచితం కాదని పేర్కొన్నారు. కోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ ఆదేశాలు జారీ చేస్తున్నప్పుడు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ అధిపతిగా కొత్త అధికారిని నియమించేలా, ఆదేశాలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు జడ్జి.
