వస్త్రధారణ స్త్రీల వ్యక్తిగత హక్కు : నాగ‌బాబు

న‌టుడు శివాజీ కామెంట్స్ ను త‌ప్పు ప‌ట్టిన న‌టుడు

hellotelugu-Nagababu

అమ‌రావ‌తి : జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నాగ‌బాబు కొణిద‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు న‌టుడు శివాజీ. ఈ సందర్భంగా ఆయ‌న‌ను ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున మ‌హిళ‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డం విస్తు పోయేలా చేసింది. చివ‌ర‌కు గ‌త్యంత‌రం లేక త‌ను చేసిన వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించు కుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇదే స‌మ‌యంలో న‌టుడు శివాజీకి షాక్ ఇచ్చింది తెలంగాణ మ‌హిళా హ‌క్కుల క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్. నోటీసులు పంపించింది వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కావాల‌ని, వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది. ఇవాళ త‌ను క‌మిష‌న్ ముందు హాజ‌ర‌య్యాడు. తాను కావాల‌ని అన‌లేద‌ని, నిండుగా ఉంటే బాగుంటుంద‌ని చెప్పాన‌ని తెలిపాడు.

ఈ త‌రుణంలో న‌టుడు శివాజీ మ‌హిళ‌ల ప‌ట్ల చేసిన కామెంట్స్ పూర్తిగా త‌ప్పేన‌ని పేర్కొన్నారు ఎమ్మెల్సీ నాగ‌బాబు. మన సమాజం ఇప్పటికీ పురుషాధిక్య ఆలోచనలతో నడుస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. మహిళలు మోడ్రన్ డ్రెస్ ధరించడం తప్పు కాద‌న్నారు. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా ఉంటుందన్నారు. మహిళలను కట్టడి చేయడం కంటే ముందు మ‌న రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు ఎమ్మెల్సీ నాగ‌బాబు కొణిద‌ల‌. ఆడపిల్లలపై అత్యాచారాలు వారి డ్రెస్ వలన కావడం లేదని అన్నారు. మగాళ్ల క్రూరత్వం వల్లే జరుగుతున్నాయని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌నైనా శివాజీ త‌న తీరు మార్చుకోవాల‌ని సూచించారు.

Exit mobile version