అమెరికా : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలనంగా మారారు. ఆయన ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. ఆ మధ్యన దావోస్ కు వెళ్లారు. అక్కడ తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడుతో కలిసి ఫోటోలు దిగారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. అక్కడి నుంచి నేరుగా అమెరికాకు వెళ్లి పోయారు. తాజాగా తన గురించి తెలంగాణ సీఎంఓ కార్యాలయం ఎప్పటికప్పుడు విశేషాలను పంచుకుంటోంది సామాజిక వేదికగా. ఇదిలా ఉండగా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కు చెందిన విద్యార్థుల బృందం సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. తమ స్కూల్ క్యాంపస్ ను చూడాలని.
అసాధారణంగా బిజీగా ఉన్న రోజున తన అన్ని తరగతులు, అసైన్‌మెంట్‌లను పూర్తి చేసిన తర్వాత, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యార్థులతో సంభాషించారు. HBS విద్యార్థుల కెరీర్ మార్గాలు , సవాళ్లను అర్థం చేసుకోవడంతో పాటు, ముఖ్యమంత్రి అనేక వృత్తి పరమైన సమస్యలను చర్చించారు . విజయానికి తన మంత్రాన్ని పంచుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను వివరించారు. విద్యార్థులు తమ నెట్‌వర్క్‌లు , ప్రతిభను ఉపయోగించుకుని భారతదేశ వృద్ధి కథకు దోహద పడాలని కోరారు సీఎం. హైదరాబాద్, తెలంగాణకు సంబంధించిన అవకాశాలు, బలాలను పంచుకోవడం ద్వారా బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

















