హైదరాబాద్ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అమలు చేస్తున్న పనులకు సంబంధించి వంద శాతం నిధులను కేంద్రమే ఇవ్వాలని అన్నారు మంత్రి సీతక్క. రాష్ట్రాలపై 40 శాతం భారం వేయకుండా, గతంలో మాదిరగా నిధులను భరించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ, వన్యప్రాణి చట్టాల వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయని ఆవేదన చెందారు. ఆదివాసీల అభివృద్ధికి అడ్డుగా ఉన్న చట్టాలను సవరించాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాల PMGSY ప్రాంతీయ సమావేశంలో మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఆమె చేసిన విన్నపానికి సానుకూలంగా స్పందించారు కేంద్ర ప్రతినిధులు. . కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారం చూపిస్తామని వెల్లడి
ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) కింద తెలంగాణకు మరిన్ని రహదారి పనులు మంజూరు చేయాలని, ముఖ్యంగా ఆదివాసి గిరిజన మారుమూల ప్రాంతాల్లో రహదారి అనుసంధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు . హైదరాబాద్‌ల దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొని రాష్ట్ర సమస్యలు, అవసరాలను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి అతిథి సింగ్, ఎన్‌ఆర్‌ఐడీఏ డైరెక్టర్ జనరల్, దక్షిణాది రాష్ట్రాల అధికారులు, ENC లు, CE లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా PMGSY గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్లకు రాకపోకలను మెరుగు పరిచిందన్నారు. ప్రస్తుతం ఈ పథకం మారుమూల గ్రామాలు, ఆదివాసి గిరిజన గూడెలను, మైదాన ప్రాంతాలతో అనుసంధానం చేస్తుంది అన్నారు. అయితే గతంలో ప్రధానమంత్రి గ్రామీణ యోజన పథకానికి 100% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించేదని ,కానీ కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చి రాష్ట్రాలపై 40 శాతం భారం వేస్తోందని మండిపడ్డారు.
