హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆసక్తికర కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసింది. తను కల్వకుంట్ల కుటుంబం నుంచి బయటకు రావడంపై స్పందించారు. తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తాము భారీయ జనతా పార్టీ తరపున తనకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు బండి సంజయ్ కుమార్. ఎలాంటి సహాయం కావాలన్నా అందజేసేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటామన్నారు. అంతే కాదు కవితక్క కోసం తన తలుపులు తెరిచే ఉంటాయని, తాను ఎలాంటి సంకోచం లేకుండా రావచ్చని సూచించారు.
ఒక రకంగా కల్వకుట్ల కాందాన్ నుంచి ధైర్యంగా బయటకు రావడం మామూలు విషయం కాదన్నారు. ఈ సందర్భంగా కవితకు హ్యాట్సాఫ్ చెబుతున్నానని ప్రకటించారు బండి సంజయ్ కుమార్ పటేల్. మాజీ సీఎం కేసీఆర్ జబర్దస్త్ రోజా ఇంటికీ వెళ్లినప్పుడు ఏం జరిగిందో చెప్పాలన్నారు. తనకు ఉన్న సమాచారం ప్రకారం జబర్దస్త్ రోజా ఇంటికీ వెళ్ళడం , ఆమె పెట్టిన రొయ్యలు, పీతలు తినడం కవితక్క కి కూడా అస్సలు ఇష్టం లేదన్నారు, వద్దు బాపు మన ఇంట్లో చేసుకుందాం అని చెప్పిందన్నారు బండి సంజయ్ కుమార్. ఇవన్నీ చెప్పినా కూడా కేసీఆర్ వినలేదన్నారు. అందుకే జనం తనను ఫామ్ హౌస్ కే పరిమితం చేశారన్నారు బండి సంజయ్ కుమార్.















